Cannibal beleived eating victim could cure his brain: అమెరికాలోని ఇదహో రాష్ట్రంలో దారుణం వెలుగుచూసింది. డేవిడ్ రస్సెల్ (39) అనే వ్యక్తి డేవిడ్ ఫ్లాగెట్ (70) అనే వృద్దుడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం అతని శరీర భాగాలను కత్తితో కోసి భుజించాడు. మనిషి మాంసం తినడం వల్ల (Cannibalism) తన బ్రెయిన్ క్యూర్ అవుతుందనే మూఢనమ్మకంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డేవిడ్ రస్సెల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఫ్లాగెట్‌ను హత్య చేశాడు. రస్సెల్ ఇంటి ముందు ఉన్న ఓ కారులో ఫ్లాగెట్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఫ్లాగెట్ రెండు చేతులు టేపుతో కట్టేసి ఉండగా... అతని శరీరంలోని కొన్ని భాగాలు మిస్ అవడాన్ని (Cannibalsim Case) గుర్తించారు. దీంతో రస్సెల్ ఇంట్లో పోలీసులు తనిఖీ చేసేందుకు వెళ్లగా... వారితో అతను గొడవపడ్డాడు. ఇది తమ వ్యక్తిగత విషయమని ఇందులో జోక్యం చేసుకోవద్దని పోలీసులతో చెప్పాడు.


పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ఇల్లంతా తనిఖీ చేయగా... కిచెన్ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న మైక్రో వేవ్‌ పూర్తిగా రక్తంతో తడిచిపోయి కనిపించింది. దాని పక్కనే గాజు గిన్నె, రక్తంతో తడిచిన కత్తిని గుర్తించారు. ఈ కేసు దర్యాప్తు బృందంలో ఒకరైన ఫిలిప్ స్టెల్లా మాట్లాడుతూ.. ఇది కేవలం రక్తపాతంతో కూడిన నేరం కాదని.. అంతకుమించిన సైకాలజికల్ ఇష్యూ అని పేర్కొన్నారు.


దర్యాప్తు బృందం ఇటీవల కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో... 'నిందితుడు రస్సెల్ ఫ్లాగెట్‌ను హత్య చేసి అతని అవయవవాలను కత్తితో కోయడం ద్వారా స్వస్థత పొందినట్లు భావించాడు...' అని పేర్కొన్నారు. అంతేకాదు, కోసిన ఆ శరీర భాగాలను రస్సెల్ తిన్నట్లు తెలిపారు. తద్వారా అతని బ్రెయిన్ క్యూర్ అవుతుందని భావించాడన్నారు. ఇదహో రాష్ట్రంలో నరమాంస భక్షణకు (Cannibalism) సంబంధించి ఇదే తొలి కేసుగా పేర్కొన్నారు. నిజానికి రస్సెల్ మానసిక స్థితిపై మొదటి నుంచి అనుమానం ఉందని.. అతనితో ముప్పు ఉందన్న విషయం కుటుంబ సభ్యులకు తెలుసునని అన్నారు. డిసెంబర్ 28న ఈ కేసుపై రివ్యూ విచారణ జరగనుంది.


Also Read: Home guards salary hike: తెలంగాణ హోంగార్డులకు గుడ్ న్యూస్-30 శాతం వేతనం పెంపు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook