భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందే భారత్ మిషన్ (Vande Bharat Mission) ప్రాజెక్టుకు ఎదురుదెబ్బ తగిలింది. భారత్ నుంచి ఎయిరిండియా విమానాల రాకపోకల (Air India's Flights Ban)ను హాంకాంగ్ నిషేధించింది. భారత్‌లో కోవిడ్19 పాజిటివ్ కేసుల తీవ్రత నేపథ్యంలో హాంకాంగ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాలలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడం, అత్యవసరమైన వారిని విదేశాలకు తీసుకెళ్లడంలో భాగం ఏర్పాటు చేసిందే ఈ ‘వందే భారత్ మిషన్’ ప్రాజెక్టు. Amit Shah: ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన హోంమంత్రి అమిత్ షా


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దీన్ని నిర్మూలించేందుకు లాక్‌డౌన్ విధించారు. విదేశాల నుంచి భారత్‌కు విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని ఓడలు, విమానాల ద్వారా విదేశాలలోని భారత ఎంబసీ అధికారుల సాయంతో సొంత ప్రాంతానికి తీసుకొస్తున్నారు. అయితే భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమైన నేపథ్యంలో హాంకాంగ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య ఎయిరిండియా విమానాల రాకపోకలను నిషేధించింది. కోవిడ్19 ఇన్ఫెక్షన్లు 6 రకాలు.. ఆ దశలో ప్రాణాలకే ముప్పు 


Sanitizer: పదే పదే శానిటైజర్‌ వాడొద్దు.. ఎందుకో తెలుసా?