కోవిడ్19 ఇన్ఫెక్షన్లు 6 రకాలు.. ఆ దశలో ప్రాణాలకే ముప్పు

COVID Infection Types | లండన్‌లోని కింగ్స్ కాలేజ్ రీసెర్చర్స్ పరిశోధనలు జరిపి కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. కోవిడ్19 ఇన్ఫెక్షన్లు (CoronaVirus Infection Types) ఆరు రకాలుగా ఉన్నాయని గుర్తించారు.

Last Updated : Aug 6, 2020, 05:29 PM IST
  • ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న మహమ్మారి CoronaVirus
  • లండన్‌లోని కింగ్స్ కాలేజ్ రీసెర్చర్స్ పరిశోధనలు
  • కోవిడ్19 ఇన్ఫెక్షన్లు ఆరు రకాలుగా ఉన్నాయి
  • ఆరో దశకు చేరితో ఇబ్బందులు అధికం
  • వెంటిలేషన్, ఆక్సిజన్ సరఫరా అందించడం తప్పనిసరి
కోవిడ్19 ఇన్ఫెక్షన్లు 6 రకాలు.. ఆ దశలో ప్రాణాలకే ముప్పు

కరోనా వైరస్ (CoronaVirus).. ఎవరికి కరోనా సోకిందో.. ఎవరికి లక్షణాలున్నాయో.. లేవో తెలియడం లేదు. దీనిపై లండన్‌లోని కింగ్స్ కాలేజ్ రీసెర్చర్స్ పరిశోధనలు జరిపి కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. కోవిడ్19 ఇన్ఫెక్షన్లు (COVID19 Infection Types) ఆరు రకాలుగా ఉన్నాయని గుర్తించారు. అమెరికా, బ్రిటన్‌కు చెందిన దాదాపు 1600 మంది కరోనాపై ఈ అధ్యయనం చేశారు. కరోనా నిర్ధారణ అయిన వ్యక్తులను తొలి వారం పరీక్షిస్తే లక్షణాలు, ఇన్ఫెక్షన్లను గుర్తించగలిగామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆరు రక్షాల కోవిడ్19 ఇన్ఫెక్షన్ల (CoronaVirus Infection Types) వివరాలు ఇవే.. Telangana: విజృంభిస్తోన్న కరోనా.. ఒకేరోజు 13 మంది మృతి

జ్వరం లేని ఫ్లూ ఇన్ఫెక్షన్: తొలి దశలో పేషెంట్లకు ఇది సోకినట్లు గుర్తించారు. వీరికి జ్వరం ఉండదు. జలుబు, గొంతునొప్పి, ఛాతీలో నొప్పి, వాసన గుర్తించకపోవడం, తలనొప్పి, కండరాల నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి.

జ్వరంతో ఫ్లూ ఇన్ఫెక్షన్: ఈ రకంలో ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తులకు జ్వరం వస్తుంది. ఫ్లూ లక్షణాలు కలిగి ఉంటారు. వీరిలో పొడి దగ్గు, గొంతులో వికారం, ఆకలి తగ్గడం లాంటి లక్షణాలను గుర్తించారు. 

గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సంక్రమణ (Gastrointestinal infection): ఈ రకం ఇన్ఫెక్షన్ సోకిన వారిలో జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. మల విసర్జనపై సైతం ప్రభావం చూపుతుంది. వీరిలో దగ్గు, వికారం, విరేచనాలు (Diarrhoea), వాంతులు, ఆకలి లేకపోవడం లక్షణాలుంటాయి. స్వల్పంగా తలనొప్పి, ఛాతీ నొప్పి లక్షణాలు కనిపిస్తాయి. COVID19 Symptoms: కరోనా ముఖ్యమైన లక్షణాలివే

ఇన్ఫెక్షన్ తీవ్రత అధికం, నీరసం (Level 1): ఈ రకం పేషెంట్లు తీవ్రమైన ఇన్ఫెక్షన్‌తో ఇబ్బంది పడతారు. రోగనిరోధక తగ్గడంతో శరీరం బాగా నీరసంగా అనిపించి అలసట వస్తుంది. కరోనా తీవ్రరూపం దాల్చిందని తెలియడానికి పెరిగిపోతున్న అలసట ఓ కారణం. వాసన కోల్పోవడం, రుచి గుర్తించలేరు. జ్వరం, తలనొప్పి, అలసట, గొంతు నొప్పి, ఛాతీలో నొప్పి లక్షణాలు ఉంటాయి. మీ ఆరోగ్యం కోసం ఈ Health Tips పాటించండి

తీవ్రమైన ఇన్ఫెక్షన్‌, నాడీ వ్యవస్థపై ప్రభావం (Level 2): లెవెల్ 1 వారితో పోల్చితే వీరిపై ఇన్ఫెక్షన్ ప్రభావం అధికం. మెదడుపై, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. తలనొప్పి, వాసన కోల్పోవడం, రుచి గుర్తించకపోవడం, దగ్గు, జ్వరం, ఆందోళన, ఛాతీ నొప్పి, గొంతు నొప్పి, కండరాల నొప్పి, అలసట.. ఈ రకం ఇన్ఫెక్షన్ లక్షణాలు.

అతి తీవ్రమైన ఇన్ఫెక్షన్, శ్వాసకోశ సమస్యలు (Level 3): తొలి వారంలో అతి తీవ్రమైన లక్షణాలు కలిగి ఉన్న పేషెంట్లలో గుర్తించిన లక్షణం శ్వాసకోశ సమస్య. ఉపిరితీసుకోవడం ఇబ్బందులు తలెత్తుతాయి. గొంతు నొప్పి, గొంతు పొడిబారటం, రుచి, వాసన కోల్పోవడం, తలనొప్పి, వాంతులు, వికారం, విరేచనాలు (Diarrhoea), కండరాల నొప్పి, దీర్ఘకాలిక జ్వరం, ఆకలి లేకపోవడం, తలనొప్పి, విరేచనాలు, శ్వాశకోశ సమస్యలు, కండరాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. Sanitizer: పదే పదే శానిటైజర్‌ వాడొద్దు.. ఎందుకో తెలుసా?

ఈ దశకు చేరిన కరోనా పేషెంట్ కచ్చితంగా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతాడు. వీరికి వెంటిలేషన్, ఆక్సిజన్ సరఫరా అందించడం తప్పనిసరి అని లండన్‌లోని కింగ్స్ కాలేజ్ పరిశోధకులు గుర్తించారు.  వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్

Trending News