Viral Pic: ఆ కారు ఒక్కసారిగా నదిలో దూసుకుపోయింది. నెమ్మదిగా కారు నీటిలో మునిగిపోతోంది. ఆ మహిళ మాత్రం కారెక్కి నిదానంగా ఫోటోలు దిగుతోంది. ఆశ్చర్యంగా ఉందా. అసలేం జరిగింది. తెలుసుకుందాం మరి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కెనడాలో జరిగిన సంఘటన ఇది. కెనడా (Canada) దేశంలోని మనోటిక్ ప్రాంతంలో ఉన్న రిడ్యూ నది ఇది. అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా నది దాదాపుగా గడ్డకట్టుకుపోయింది. ఓ మహిళ డ్రైవ్ చేస్తున్న పసుపురంగు కారొకటి వేగంగా నదిలో దూసుకుపోయింది. మంచుగా మారిన ఆ నదిలో పడ్డ కారు..క్రమ క్రమంగా మునిగిపోతోంది. డ్రైవ్ చేస్తున్న మహిళ మాత్రం ఏ మాత్రం భయపడకుండా..ఆ కారు పైకెక్కింది. తన సెల్‌ఫోన్‌తో సెల్ఫీలు దిగడం ప్రారంభించింది. ఓ వైపు కారు మునిగిపోతుంటే..ఈ మహిళ మాత్రం సెల్ఫీలు దిగడం మొదలెట్టింది. మరోవైపు స్థానికంగా ఉన్న ప్రజలు మాత్రం ఆ మహిళను..కారును చూసి ఆందోళన చెందారు. మహిళను కాపాడే ప్రయత్నాలు ప్రారంభించారు.



ఈ సెల్ఫీ ఫోటోలు (Woman Selfie) ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న స్థానికులు తనను రక్షించేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని సెల్ఫీ ద్వారా బంధించేందుకు ఆ మహిళ ప్రయత్నించిందని కొందరు కామెంట్లు కూడా చేశారు. మొత్తానికి స్థానికులు ఆమెను రక్షించారు. స్థానికుల స్పందించిన తీరుపై ఒట్టావా పోలీసులు (Ottawa Police) ప్రశంసించారు. ఆ మహిళకు ఏ గాయాలు లేకుండా వెంటనే రక్షించినందుకు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.



Also read: 5G Services In US: అమెరికాలో 5జీ సేవలు ప్రారంభం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook