టాలెంట్ ఉన్న వారే అమెరికాకు రావాలని అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ నిర్ణయం ఇండియా వంటి దేశాల నుండి వచ్చే టెక్కీలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ట్రంప్ తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'సరిహద్దుల విషయంలో (అక్రమంగా దేశంలో చొరబడే వారు) నేను, నా ప్రభుత్వం చాలా కఠినంగా ఉన్నాము. ప్రజలు దేశంలో చట్టవిరుద్ధంగా కాకుండా చట్టపరంగా తమ దేశంలోకి ప్రవేశించాలి. మెరిట్/టాలెంట్ ఉన్నవారు దేశానికి రావాలనుకుంటున్నాను.' అని ట్రంప్ అన్నట్లు వైట్ హౌస్ శనివారం పేర్కొంది. అక్రమంగా దేశంలోకి వచ్చే వారి గురించి మీడియా ప్రశ్నలు అడగ్గా..ట్రంప్ పైవిధంగా స్పందించారు.


'మెరిట్ ఆధారంగా ప్రజలు అమెరికాకు వస్తే బాగుంటుంది. ఈ నిర్ణయం భారత్ వంటి దేశాల నుండి వచ్చే టెక్కీలకు ఎంతగానో సహాయపడుతుందనుకుంటున్నా.' అని ట్రంప్ అన్నారు.


మెరిట్ ఉన్న వారికే వారికే వీసాలు ఇస్తామని ట్రంప్ పునరుద్ఘాటించారు. దేశ అభివృద్ధికి సహాయపడే వారే అమెరికాకు రావాలని కోరారు. తమ దేశంలో చాలా కంపెనీలు ఉన్నాయని.. ఆ కంపెనీలు కూడా స్కిల్ ఉన్న అభ్యర్ధులనే ఎంపిక చేసుకోవాలన్నారు.


"నాకు మెరిట్ ముఖ్యం. మెరిట్‌ ఉన్న చాలా మంది రావాలనుకుంటున్నాను. మా దేశంలో ప్రముఖ కార్ల కంపెనీలు భారీ ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తున్నాయి." అని ట్రంప్ అన్నారు.


బ్రిటన్ వీసా రుసుము పెంపు!


ఐరోపా దేశం బ్రిటన్‌.. బయటి దేశాల నుంచి వచ్చే వలసదారులపై విధించే హెల్త్‌ సర్‌చార్జీని డిసెంబరు నుంచి రెండింతలు చేయనుందని సమాచారం. దీంతో భారత్‌ సహా పలు దేశాల నుంచి బ్రిటన్‌కు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు వీసా ఫీజు కింద మరింత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వలస వీసాదారులు ఏడాదికి 200 (దాదాపు రూ. 19,400) పౌండ్లు, విద్యార్థి వీసా ఉన్నవారు ఏడాదికి 150 (దాదాపు రూ. 14,540) పౌండ్లు సర్‌చార్జీ కింద చెల్లిస్తున్నారు.


తాజాగా ఈ మొత్తాన్ని బ్రిటన్‌ రెండింతలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో.. వలస వీసాదారులు 400 (దాదాపు రూ. 38,800) పౌండ్లు, విద్యార్థి వీసాదారులు 300 (దాదాపు రూ. 29,080) పౌండ్లను చెల్లించాల్సి ఉంటుంది. అయితే తాజా పెంపు నుంచి యూరోపియన్‌ యూనియన్‌ దేశాల పౌరులను మినహాయించారు.