Video: బ్రిటీష్ ఎయిర్వేస్ విమానానికి తప్పిన ప్రమాదం.. పైలట్ చాకచక్యం..
British Airways flight tilts sideways: బ్రిటీష్ ఎయిర్‌వేస్‌కి విమానానికి తృటిలో భారీ ప్రమాదం తప్పింది. రన్ వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో భారీ కుదుపులకు లోనై ఒక పక్కకు ఒరిగిపోయినట్లయింది.
British Airways flight tilts sideways: బ్రిటీష్ ఎయిర్‌వేస్‌కి చెందిన ఓ విమానానికి భారీ ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో భారీ ఈదురు గాలుల కారణంగా విమానం కుదుపులకు లోనైంది. రన్ వేపై ఒక పక్కకు ఒరిగిపోయినట్లయింది. అయితే చాకచక్యంగా వ్యవహరించిన పైలట్ విమానాన్ని మళ్లీ టేకాఫ్ చేశాడు. కాసేపటి తర్వాత ఎట్టకేలకు విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేశాడు. యూకెలోని హీత్రో ఎయిర్‌పోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను బిగ్ జెట్ టీవీ ట్విట్టర్‌లో షేర్ చేసింది.
ఆ విమానం అబెర్దీన్ ఎయిర్‌పోర్ట్ నుంచి హీత్రో ఎయిర్‌పోర్టుకు సోమవారం ఉదయం 10.50 గంటలకు చేరుకుంది. అయితే ఆ సమయంలో భారీ ఈదురు గాలులకు విమానం కుదుపులకు లోనవ్వడంతో.. పైలట్ విమానాన్ని ల్యాండ్ చేసినట్లే చేసి మళ్లీ టేకాఫ్ చేశాడు. పైలట్ తీసుకున్న నిర్ణయంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.
రెండో ప్రయత్నంలో పైలట్ విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, భారీ ఈదురు గాలులు వీస్తున్నాయని తెలిసినప్పటికీ విమానం ల్యాండింగ్‌కి ఎలా అనుమతించారని వీడియోపై (Viral Video) స్పందించిన పలువురు నెటిజన్లు హీత్రో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను ప్రశ్నించారు. ఆ పైలట్‌పై చర్యలు తీసుకున్నారా అంటూ పలువురు నెటిజన్లు ఆరా తీయడం గమనార్హం. ప్రత్యక్ష సాక్షులు కొందరు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ఆ విమానం ఎక్కడ బోల్తా కొడుతుందోనని తాము ఆందోళన చెందినట్లు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook