Viral Video: మూడేళ్ల కుమార్తెను జూలోని ఎలుగుబంటికి విసిరిన తల్లి.. చివరికి ఏమైందంటే? (వీడియో)

ఓ 30 ఏళ్ల మహిళ తన మూడేళ్ల కుమార్తెను జూలోని బేర్ పిట్‌లోకి విసిరింది. ఈ దారుణ ఘటన ఉజ్బెకిస్తాన్‌ తాష్కెంట్‌లోని జంతు ప్రదర్శనశాలలో చోటుచేసుకుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 2, 2022, 04:23 PM IST
  • కుమార్తెను జూలోని ఎలుగుబంటికి విసిరిన తల్లి
  • తల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • చివరికి ఏమైందంటే?
Viral Video: మూడేళ్ల కుమార్తెను జూలోని ఎలుగుబంటికి విసిరిన తల్లి.. చివరికి ఏమైందంటే? (వీడియో)

Woman throwing her 3 Year Old Daughter into a Bear's enclosure: ఈ భూ ప్రపంచంలో తల్లి ప్రేమకు మించింది మరొకటి లేదు. కడుపులో నవమాసాలు మోసిన తల్లి.. బిడ్డ బయటికొచ్చాక కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. తాను పస్తులున్నా సరే.. పిల్లలకు మాత్రం మూడు పూటలా భోజనం పెడుతుంది. అయితే ఓ తల్లి మాత్రం తన మూడేళ్ల కూతురును చంపేందుకు ప్రయత్నించింది. తన కుమార్తెను జూలోని ఎలుగుబంటికి ఆహారంగా పడేసింది. ఈ ఘటన ఉజ్బెకిస్తాన్‌లో చోటు చేసుకుంది. 

ది డైలీ మెయిల్ యొక్క నివేదిక ప్రకారం... ఓ 30 ఏళ్ల మహిళ తన మూడేళ్ల కుమార్తెతో కలిసి ఉజ్బెకిస్తాన్‌ తాష్కెంట్‌లోని జంతు ప్రదర్శనశాలకు వచ్చింది. ఉన్నంటుండి ఆమెకు ఏమైందో తెలియదు కానీ.. అందరూ చూస్తుండగానే తన కూతురిని జూలోని ఎలుగుబంటి గుంతలోకి విసిరింది. దాంతో అక్కడనుంది వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొందరు కేకలు వేయడంతో జూ కీపర్లు వెంటనే అప్రమత్తమయ్యారు. 

జుజు అనే గోధుమ రంగు ఎలుగుబంటి గుంతలో పడిన చిన్నారిని తన మూతితో కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. ఈ లోగా జూ కీపర్లు జుజుని బోనులోకి తీసుకుని చిన్నారిని కాపాడారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. చిన్నారికి ఎలుగుబంటి వల్ల ఎలాంటి హాని జరగలేదు కానీ పై నుంచి కిందపడటంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ చిన్నారి కంకషన్‌కు గురైనట్టు డాక్టర్లు చెప్పారు. హత్యాయత్నానికి ప్రయత్నించిన తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకుని క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఒకవేళ నేరం రుజువైతే ఆమెకు 15 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

తన మూడేళ్ల కుమార్తెను జూలోని ఎలుగుబంటికి కావాలనే విసిరేసినట్టు వీడియోను చూస్తే ఇట్టే అరమవుతుంది. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఆ మహిళ గత కొన్ని నెలలుగా డిప్రెషన్‌ల ఉందట. తన భర్త రష్యాలో ఉద్యోగం చేయడానికి ఆమెను విడిచివెళ్లాడట. అందుకే ఆమె ఇలా వ్యవహరిస్తోందట. అయితే ఆ మహిళ ఓ విశ్వవిద్యాలయంలో లెక్చరర్ కావడం విశేషం. ప్రస్తుతం ఆమె తన ఇద్దరు పిల్లలు మరియు తండ్రితో కలిసి తాష్కెంట్‌లో ఉంటోందట. 

Also Read: Amritha Aiyer: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఇన్‌స్టా అకౌంట్ హ్యాకింగ్.. పోలీసులకు ఫిర్యాదు!!

Also Read: Viral Video: హైవే రోడ్డుపై 4 కిమీ మండుతూ వెళ్లిన ట్రక్కు.. చివరకు ఏమైందంటే? (వీడియో)!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News