నాజీల నాయకుడు హిట్లర్, పాప్ సింగర్ మడోన్నాతో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో పూర్తిగా కల్పితమైన  కథతో రచయిత ఫ్రాంక్ హుజుర్ ఓ నాటకాన్ని రాశారట. ప్రస్తుతం ఈ పుస్తకంపై ఆన్‌లైన్‌లో చాలా చర్చలు జరుగుతున్నాయి. ప్రేమ అనేది ఎంత గొప్ప హింసావాదినైనా మార్చేస్తుందని.. మడోన్నా ప్రేమలో పడిన హిట్లర్ కూడా అలాగే మారాతాడేమో అనే కోణంలో ఆలోచించి తాము ఈ నాటకాన్ని రాశామని ఫ్రాంక్ హుజూర్ తెలపడం గమనార్హం.  హిట్లర్‌ను పూర్తి కొత్త వ్యక్తిగా ఇందులో చూపించడానికి ప్రయత్నించారట రచయిత.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిట్లర్, మడోన్నా ఇద్దరూ వేరు వేరు తరాలకు చెందిన వ్యక్తులైనా సరే వారి మధ్య ఒక ప్రేమకథను సృష్టిస్తే ఎలా ఉంటుందనే చిలిపి ఆలోచనకు ఫలితమే "హిట్లర్ ఇన్ లవ్ విత్ మడోన్నా" అనే పుస్తకం. ఎప్పుడో తన 20 ఏళ్ల వయసులో కాలేజీలో ఉన్నప్పుడు సరదాగా రాసిన ఈ నాటకం కొన్నాళ్ల తర్వాత నిషేధానికి గురైంది. అయితే అప్పట్లో భారత ప్రభుత్వం ఈ నాటకాన్ని బ్యాన్ చేసిందట. ఎందుకంటే ఆ నాటకంలో అద్వానీ పేరును, బాబ్రీమసీదు ఘటనను కూడా ఓ సందర్భంలో ప్రస్తావిస్తారట రచయిత. 


చిత్రమేంటంటే ఈ నాటకం రాసిన రచయిత పుట్టింది బీహార్‌లో. అయినా స్వయంగా పాకిస్తాన్ ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ని కలిసి ఆయన ఆత్మకథను రాస్తానని కూడా అడిగాడట. అలాగే కష్టపడి ఒప్పించాడట కూడా. "ఇమ్రాన్ వర్సెస్ ఇమ్రాన్" పేరుతో రాసిన ఆ బయోగ్రఫీ ఎంతో పాపులర్ అయ్యింది. లండన్, లాహోర్, ముంబయి, లక్నో.. ఈ ప్రాంతాల చుట్టూ తన సాహిత్య జీవితం తిరుగుతుందని చెప్పే ఫ్రాంక్ హుజూర్ ప్రస్తుతం తన రచన "హిట్లర్ ఇన్ లవ్ విత్ మడోన్నా" రచన వెలుగులోకి రావడంతో తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు