US Covid Relief: కరోనా విపత్కర పరిస్థితులతో అల్లాడుతున్న భారదేశానికి ప్రపంచం యావత్తూ అండగా నిలుస్తోంది. ముఖ్యంగా ఆక్సిజన్ కొరత, వైద్య సామగ్రిని విరివిగా అందిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా..ఇండియాకు అక్షరాలా చేసిన సహాయం విలువెంతో తెలుసా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)దేశాన్ని వణికిస్తోంది. రోజుకు 4 లక్షలకు పైగా కేసులు నమోదైన పరిస్థితి ఏర్పడింది. గత కొద్దిరోజులుగా ఇండియాలో కరోనా ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. కరోనా విపత్కర పరిస్థితులతో దేశంలో ఆక్సిజన్, బెడ్స్, వైద్య సామగ్రి, అత్యవసర మందుల కొరత తీవ్రంగా ఏర్పడింది. ఈ నేపద్యంలో ఇండియాను ఆదుకునేందుకు అన్నిదేశాలూ ముందుకొచ్చాయి. ముఖ్యంగా సౌదీ అరేబియా, సింగపూర్, ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా, మలేషియా దేశాల్నించి పెద్దఎత్తున ఆక్సిజన్, ఇతర వైద్య సామగ్రి సహాయంగా అందింది. అగ్రరాజ్యం అమెరికా (America) ఇండియాకు మద్దతుగా నిలిచి సహాయం అందిస్తోంది. ఈ క్రమంలో వైట్‌హౌస్ నిన్న కీలక ప్రకటన చేసింది. 


ఇప్పటి వరకూ ఇండియాకు 5 వందల మిలియన్ డాలర్ల సహాయం చేసినట్టు వైట్‌హౌస్ (White House) వర్గాలు ప్రకటించాయి. 80 మిలియన్ల వ్యాక్సిన్లకు ఇతర దేశాలకు పంపిణీ చేయడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపాయి. ఇప్పటి వరకూ ఇండియాకు అమెరికా ప్రభుత్వం 5 వందల మిలియన్ డాలర్ల కోవిడ్ (Covid Relief to India) సహాయాన్ని అందించిందని వైట్‌హౌస్ సెక్రటరీ ప్రకటించారు. అమెరికా సమాఖ్య, రాష్ట్ర ప్రభుత్వాలు, అమెరికన్ కంపెనీలు, సంస్థలు, ప్రైవేట్ పౌరుల సహకారంతో ఈ సహాయం అందించినట్టు తెలిపారు. కోవిడ్ మహమ్మారి ప్రభావంతో బాధపడుతున్న ఇతర దక్షిణాసియా దేశాలకు సైతం సహాయాన్ని అందించేందుకు జో బిడెన్ (Joe Biden) ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇందులో భాగంగా 80 కోట్ల వ్యాక్సిన్లు ( 80 Crores vaccines) అందించాలన్నారు. ఇందులో 60 కోట్ల ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు, మరో మూడు కంపెనీలకు చెందిన 20 కోట్ల వ్యాక్సి్లు ఉన్నాయి.


Also read: Singapore warns Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కి సింగపూర్ వార్నింగ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook