White House Press Secretary: అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కరోనా కలవరం రేపుతుంది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి కి (Jen Psaki News) కరోనా సోకినట్లు తేలింది. ఇదే విషయమై ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొవిడ్ వాక్సిన్ వేయించుకున్నా.. తేలికపాటి కరోనా లక్షణాలు ఉన్నాయని ఆమె తెలిపారు. గత మంగళవారం ప్రెసిడెంట్ జో బైడెన్ ను (Joe Biden News) తాను కలిసినట్లు సాకి తెలిపారు. అయితే అధ్యక్షుడు జో బైడెన్ కు శనివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ గా తేలిందని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"సిబ్బందికి కరోనా సోకిందని తెలిసి బుధవారం నుంచి క్వారంటైన్​లో ఉన్నాను. నాలుగు రోజుల పాటు నాకు నెగెటివ్​ వచ్చింది. కానీ ఇప్పుడు చేసుకున్న పరీక్షలో పాజిటివ్​గా తేలింది. అధ్యక్షుడు బైడెన్​తో కానీ, ఇతర ముఖ్య అధికారులతో కానీ ఎక్కువగా కలవలేదు" అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి వెల్లడించారు.


వైట్ హౌస్ మీడియా ప్రధాన ప్రతినిధిగా  ఈ ఏడాది జనవరిలో  నియమితురాలయ్యారు జెన్ సాకి. కరోనా సోకిన నేపథ్యంలో ఈ వారం బైడెన్ తో పాటు రోమ్, గ్లాస్గో పర్యటనలకు (Joe Biden Rome Tour) ఆమె దూరంగా ఉండనుంది. ప్రస్తుతం ఆమె క్వారంటైన్ లో సమయాన్ని గడుపుతుంది. మరో 10 రోజుల క్వారంటైన్ తర్వాత తిరిగి విధుల్లోకి చేరుతానని జెన్ సాకి వెల్లడించారు.


Also Read: China Taiwan: తైవాన్‌ కచ్చితంగా చైనాలో కలవాల్సిందే ‌‌- చైనా స్టేట్ కౌన్సిలర్ వాంగ్ యీ


Also Read: Vaccine For Kids: చిన్నారుల కరోనా టీకాకు అమెరికా ఎఫ్​డీఏ ఆమోదం- 5-11 ఏళ్ల వారికి ఇచ్చేందుకు కసరత్తు!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook