Wikileaks Julian Assandge: 14 ఏళ్ల తరువాత వికీలీక్స్ జూలియన్ అసాంజేకు విముక్తి
Wikileaks Julian Assandge: ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు రేపిన వికీలీక్స్ అధినేత జూలియన్ అసాంజే ఎట్టకేలకు 14 ఏళ్ల సుదీర్ఘ జైలువాసం నుంచి విముక్తి పొందారు. చేసిన నేరాన్ని ఒప్పుకోవడంతో ఇన్నాళ్లకు జైలు జీవితం నుంచి స్వేచ్ఛ లభించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Wikileaks Julian Assandge: మిలిటరీ రహస్య సమాచారాన్ని లీక్ చేసిన కేసులో వికీలీక్స్ అధినేత జూలియన్ అసాంజే 14 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా సాగించిన న్యాయ పోరాటం ముగిసింది. అమెరికా ప్రభుత్వంతో నేరారోపణ ఒప్పందం అనంతరం విడుదలకు మార్గం సుగమమైంది. 14 ఏళ్ల తరువాత బయటి ప్రపంచాన్ని చూశారు. కాస్సేపటి క్రితం విడుదలైన ఆయన స్వదేశం ఆస్ట్రేలియాకు పయనం కానున్నారు.
అసలేం జరిగిందంటే..
ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాల్లో అమెరికా సైన్యం చేసిన తప్పిదాలు, తప్పుడు చర్యలకు సంబంధించిన లక్షలాది రహస్య పత్రాల్ని వికీలీక్స్ పేరుతో లీక్ చేయడంతో జూలియన్ అసాంజే పేరు మార్మోగిపోయింది. అమెరికా రక్షణ శాఖ రహస్య పత్రాలు బహిర్గతమయ్యాయి. బాగ్దాద్‌పై అమెరికా చేసిన వైమానిక దాడిలో ఇద్దరు రాయిటర్స్ జర్నలిస్టులు, సామాన్యులు మరణించిన వీడియోలు కూడా వికీలీక్స్‌లో ఉన్నాయి. ఆఫ్గన్ యుద్దానికి సంబంధించిన 91 వేల పత్రాలు, ఇరాక్ యుద్ధానికి సంబంధించి 4 లక్షల రహస్య ఫైల్స్ వికీలీక్స్ విడుదల చేసింది. దీంతో అమెరికా జూలియన్ అసాంజేపై తీవ్రమైన అభియోగాలు మోపింది. స్వీడన్ కోర్టు అరెస్టుకు ఆదేశించింది. 2010 అక్టోబర్ నెలలో బ్రిటన్‌లో అరెస్ట్ అయిన అసాంజే బెయిల్‌పై బయటికొచ్చారు. అనంతరం లండన్‌లోని ఈక్వెడార్‌లో రాజకీయ ఆశ్రయంలో ఉన్నారు. 2019లో ఇది కాస్తా రద్దవడంతో తిరిగి అరెస్ట్ అయి బ్రిటన్ జైలులో ఉన్నారు. అప్పట్నించి అసాంజేను అప్పగించే విషయమై బ్రిటన్-అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి.
ఇప్పుడు అమెరికా ప్రభుత్వంతో నేరాంగీకర ఒప్పందం చేసుకోవడంతో బ్రిటన్ జైలు నుంచి విడుదలై అెమెరికాలోని మరియానా కోర్టులో హాజరయ్యారు. కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం గూఢచర్య చట్టం అతిక్రమణ, జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారం లీక్ చేయడం వంటి ఆరోపణల్ని అసాంజే అంగీకరించారు. ఈ నేరాలన్నింటికీ ఇప్పటికే బ్రిటన్‌లో జైలు శిక్ష అనుభవించడంతో ఇక ఎలాంటి శిక్ష లేకుండా కోర్టు విడుదల చేసింది. బ్రిటన్‌లో ఐదేళ్ల జైలు శిక్షతో కలుపుకుని మొత్తం 14 ఏళ్ల వనవాసం తరువాత ఈ కేసు నుంచి బయటపడ్డారు. ఆస్ట్రేలియాలోని క్వాన్‌బెరాకు ప్రత్యేక విమానంలో బయలు దేరారు.
Also read: Redmi Note 13 Pro: 108MP, 200MP కెమేరా, 12 జీబీ ర్యామ్‌తో రెడ్‌మి నోట్ 13 ప్రో విడుదల, ధర ఎంతంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook