క్లినికల్ ట్రయల్స్‌కు రె`ఢీ`
`కరోనా వైరస్` కరాళ నృత్యం చేస్తున్న వేళ.. అందరి చూపు ఒకటే వైపు. అదే ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా..? అని. ఐతే ఆ సమయం రానే వచ్చేస్తోందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ..WHO ఓ తీయటి కబురు వెల్లడించింది.
'కరోనా వైరస్' కరాళ నృత్యం చేస్తున్న వేళ.. అందరి చూపు ఒకటే వైపు. అదే ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా..? అని. ఐతే ఆ సమయం రానే వచ్చేస్తోందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ..WHO ఓ తీయటి కబురు వెల్లడించింది.
8 కరోనా వ్యాక్సిన్లు రెడీ..!!
క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధం..
ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి..
కరోనా వైరస్ మహమ్మారిని అడ్డుకునే వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఐతే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని పరిశోధకులు కూడా ఇప్పుడు 24 గంటలు అదే పని మీద ఉన్నారు. తమ పరిశోధనలకు పదును పెడుతున్నారు. కరోనా రాక్షసి పీచమణిచే వ్యాక్సిన్ కనుక్కునేందుకు నిరంతరం పరిశోధన చేస్తున్నారు.
ఇప్పటి వరకు దాదాపు 110 వ్యాక్సిన్‌లు సిద్ధమవుతున్నాయని ప్రపంచ ఆరోగ్యం సంస్థ.. WHO వెల్లడించింది. అందులో 8 వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ కు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. అమెరికా, చైనా, జర్మనీ పరిశోధకులు రూపొందించిన వ్యాక్సిన్లు అందరి కంటే ముందుకు క్లినికల్ ట్రయల్స్‌కు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
అంతే కాదు అమెరికా, చైనా దేశాలు ఇప్పటికే కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చే సమయాన్ని కూడా ప్రకటించాయి. దీంతో నిర్దేశించిన సమయం లేదా అంత కంటే ముందుగానే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్న ధోరణి కనిపిస్తోంది. వచ్చే ఏడాది మార్చి వరకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువస్తామని చైనా ప్రకటించింది. మరోవైపు ఈ ఏడాది చివరి వరకు అమెరికా నుంచి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అగ్రరాజ్యం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు ప్రపంచ దేశాలు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చే సమయాన్ని ప్రకటిస్తుండగానే.. కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 46 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా దెబ్బకు 3 లక్షల 11 వేల 425 మంది ప్రాణాలు కోల్పోయారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..