భారతదేశంలోనూ 'కరోనా వైరస్' కోరలు చాస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్యలో విపరీతంగా పెరుగుదల కనిపిస్తూనే ఉంది. నిన్న ఒక్కరోజే భారత దేశంలో నమోదైన కేసుల సంఖ్య కొత్త రికార్డులకు తెరతీస్తోంది.
ఇండియాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. పైగా రోజువారీ లెక్క పెరుగుతూనే ఉంది. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. నిన్న ఒక్కరోజే కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య 4 వేల 987గా రికార్డైంది. ఇప్పటి వరకు ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం కావడం విశేషం. ఫలితంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 90 వేల మార్క్ దాటింది.
క్యాబ్‌లో ప్రయాణం ఇలా..!!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90 వేల 927కు చేరిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అందులో 53 వేల 946 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని తెలిపింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2వేల 872 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. నిన్న ఒక్క రోజే కరోనా దెబ్బకు 120 మంది చనిపోయారు.
ఐతే ఇప్పటి వరకు కరోనా బారిన పడి చికిత్స తీసుకుని సురక్షితంగా ఇంటికి వెళ్లిన వారి సంఖ్య 34 వేల 108గా ఉంది. రోజు రోజుకు రికవరీ రేటు పెరగడం కాస్త ఊరటనిచ్చే అంశమని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 37.51 శాతంగా ఉందని వెల్లడించింది. మరోవైపు రెండు రోజుల క్రితంతో నిన్నటి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యను పోలిస్తే.. వెయ్యి కేసులు ఎక్కువగా నమోదు కావడం విశేషం.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..