World Milk Day 2022: నేడు ప్రపంచ పాల దినోత్సవం.. అసలు ఇది ఎందుకు జరుపుకుంటారు.. దీని ప్రాముఖ్యత ఏంటి...
World Milk Day 2022: నేడు ప్రపంచ పాల దినోత్సవం... అసలు మిల్క్ డే ఎందుకు జరుపకుంటారు.. ఎప్పటినుంచి జరుపుతున్నారు... దాని ప్రాముఖ్యత ఏంటో మీకు తెలుసా...
World Milk Day 2022: ఇవాళ ప్రపంచ పాల దినోత్సవం. గ్లోబల్ ఫుడ్‌గా పాల ప్రాముఖ్యతను తెలియజెప్పేందుకు ప్రపంచ పాల దినోత్సవం జరుపుకుంటారు. ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) 2001 నుంచి జూన్ 1వ తేదీన ప్రపంచ పాల దినోత్సవాన్ని జరుపుతోంది. పాలు, పాల పదార్థాలను ఆహారంగా తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ఈరోజున విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ పైచిలుకు ప్రజలకు డైరీ రంగం కల్పిస్తున్న జీవనోపాధిని కూడా ఈ కార్యక్రమాల్లో హైలైట్ చేస్తారు.
ప్రపంచ పాల దినోత్సవం ప్రాముఖ్యత :
పాలు, పాల పదార్థాలు సంపూర్ణ పోషకాహారం. పుట్టిన ప్రతీ బిడ్డ మొదటి ఆహారం పాలు మాత్రమే. ఆహారంగా పాలు, పాల పదార్థాల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే 'ప్రపంచ పాల దినోత్సవం'. అంతేకాదు, ఈ రంగం కోట్లాది మంది ప్రజలకు ఇప్పుడో మంచి ఆదాయ వనరు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఈ రంగం ఇప్పుడు కీలకంగా మారింది. ముఖ్యంగా భారత ఆర్థిక వ్యవస్థలో డైరీ రంగం ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉంది. ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా ఈ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
ఈసారి థీమ్ ఇదే :
క్లైమేట్ చేంజ్ క్రైసిస్... వాతావరణ మార్పుల వలన తలెత్తుతున్న పర్యావరణ సంక్షోభం.. డైరీ రంగం ద్వారా భూమిపై ఆ ప్రభావాన్ని తగ్గించడమనే థీమ్‌తో ఈసారి ప్రపంచ పాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. రాబోయే 30 ఏళ్లలో పాడి పరిశ్రమ నుంచి వెలువడే గ్రీన్‌హౌస్ గ్యాస్ ఉద్గారాలను తగ్గించడం ద్వారా 'డైరీ నెట్ జీరో'ని సాధించడం పట్ల ఎక్కువగా ఫోకస్ చేయనున్నారు.
Also Read: LPG Cylinder Price: బిగ్ రిలీఫ్... భారీగా తగ్గిన ఎల్‌పీజీ సిలిండర్ ధర... ఏయే నగరాల్లో ఎంతంటే..
Also Read: French Open: ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం..వరల్డ్ నెంబర్ వన్‌కు షాక్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook