జేనీవాలోని యూఎన్ఎఫ్‌పీఏ (యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్) ఓ ప్రకటనను విడుదల చేస్తూ... ఇటీవలే ప్రపంచ జనాభా దాదాపు 760 కోట్లకు చేరుకుందని.. 2050 సంవత్సరం నాటి ఈ సంఖ్య మరో 220 కోట్లు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. 2018 మే నెల వరకూ ప్రపంచ జనాభా సంఖ్యను పరిశీలించడం కోసం బేరీజు వేసుకున్న గణంకాల ఆధారంగా యూఎన్ఎఫ్‌పీఏ సంచాలకులు మోనికా ఫెర్రో ఈ ప్రకటన చేశారు. ముఖ్యంగా రాబోయే కాలంలో జనాభా సహారా ఎడారికి దిగువనున్న ఆఫ్రికా దేశాలలో పెరిగే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో భారతదేశం జనాభా 134 కోట్లకు దగ్గరగా ఉండగా.. చైనా జనాభా 139 కోట్లకు దగ్గరగా ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీటి తర్వాత స్థానాల్లో అమెరికా (32 కోట్లు), ఇండోనేషియా (26 కోట్లు), బ్రెజిల్ (21 కోట్లు), పాకిస్తాన్ (20 కోట్లు), నైజీరియా (19 కోట్లు), బంగ్లాదేశ్ (16 కోట్లు), రష్యా (14 కోట్లు), మెక్సికో (13 కోట్లు) ఉన్నాయన్నది సమాచారం. వీటి తర్వాతి స్థానాల్లో జపాన్, ఇథియోపియా, ఫిలిప్పీన్స్, ఈజిప్టు, వియత్నాం, కాంగో, జర్మనీ, ఇటలీ, దక్షిణ ఆఫ్రికా, టాంజానియా, మయన్మార్, దక్షిణ కొరియా, కెన్యా, కొలంబియా, స్పెయిన్, అర్జెంటీనా ఉన్నాయి. 


భారతదేశంలో 2011 సెన్సస్ ప్రకారం 19 కోట్ల జనాభాతో ఉత్తరప్రదేశ్ తొలి స్థానంలో ఉండగా.. మహారాష్ట్ర (11.2 కోట్లు), బిహార్ (10.4 కోట్లు), పశ్చిమ బెంగాల్ (9.1 కోట్లు), ఆంధ్రప్రదేశ్ (8.4 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మన దేశంలో అతి తక్కువ  జనాభా కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ (64000 మాత్రమే) నమోదు కాగా.. రాష్ట్రాల్లో సిక్కిం (6,10,577) ఆఖరి స్థానాన్ని నమోదు చేసుకుంది. మళ్లీ 2021 సంవత్సరంలో భారతదేశం కొత్త జనాభా లెక్కలతో.. కొత్త రిపోర్టును రూపొందిస్తుంది. ప్రతీ పది  సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలో జనాభా లెక్కల గణాంకాలను నమోదు చేయడం ఆనవాయితీగా వస్తోంది.