World Teachers Day 2022: ప్రపంచంలో ప్రతి అంశానికి ఓ రోజు ఉంది. కొన్ని అంశాలకు దేశాన్ని బట్టి మారుతుంటే మరి కొన్నింటికి ప్రపంచమంతా ఒకటే దినోత్సవం. టీచర్స్ డే మాత్రం వేర్వేరుగానే ఉన్నాయి. ఇండియాలో టీచర్స్ డే అనగానే ఠక్కున గుర్తొచ్చేది సెప్టెంబర్ 5.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ రెండవ అధ్యక్షుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకుని ప్రతి యేటా సెప్టెంబర్ 5వ తేదీన జరుపుకుుంటుంటాం..మరి ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం ఏంటి, ఎందుకు..ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం ప్రతియేటా అక్టోబర్ 5వ తేదీన అంటే ఇవాళ జరుపుకుంటున్నారు. యునెస్కో ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని అక్టోబర్ 5వ తేదీన గుర్తించింది. ఈ సందర్భంగా యునెస్కో సిఫారసుల్ని గౌరవించే లక్ష్యంతో ఈ ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహిస్తున్నారు.


అక్టోబర్ 5వ తేదీన ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని 1994 నుంచి జరుపుకుంటున్నారు. విద్యార్ధులను తీర్చిదిద్దడంలో టీచర్లు పాత్రను గౌరవించేందుకు జరుపుకుంటున్న ప్రత్యేక రోజు ఇది. ఇవాళ ప్రపంచమంతా 28వ ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటున్నారు. 


ప్రపంచ టీచర్ల దినోత్సవం నేపధ్యం


యునెస్కో 1994లో అక్టోబర్ 5వ తేదీన ప్రపంచ టీచర్ల దినోత్సవంగా గుర్తించింది. యునెస్కో సిఫారసుల్ని గౌరవించడమే దీని లక్ష్యం. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించడంతో అప్పట్నించి నిరాటంకంగా జరుపుకుంటున్నారు. విద్య బదిలీ లేదా రూపాంతరం అనేది టీచర్లతో ప్రారంభమౌతుందనేది ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం థీమ్‌గా ఉంది. 


ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం ప్రత్యేకత


విద్యార్ధుల్ని తీర్దిదిద్దడం, శిక్షణ అందించడంలో టీచర్ల పాత్ర, కృషిని గుర్తిస్తూ వేడుకగా నిర్వహించేందుకు ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ప్రకటించారు. అదే సమయంలో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న సమస్యల్ని కూడా యునెస్కో గుర్తించింది. 


Also read: Nobel prize in Physics 2022: క్వాంటమ్ మెకానిక్స్​ పరిశోధనలకు 'భౌతిక' నోబెల్.. ముగ్గురిని వరించిన ప్రతిష్టాత్మక అవార్డు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook