9/11 Attacks: ప్రపంచాన్ని కుదిపేసిన దాడులవి. ఇవాళ్టికి సరిగ్గా 20 ఏళ్లు. అమెరికానే కాదు మొత్తం ప్రపంచాన్ని సవాలు చేసిన రోజు. ట్విన్ టవర్స్ చూస్తుండగానే కళ్లముందే కూలిపోయిన రోజు. అదే 9/11 ఉగ్రదాడుల ఘటన జరిగిన రోజు. ఆ వివరాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2001 సెప్టెంబర్ 11వ తేదీ. ప్రపంచమే నివ్వెరపోయిన రోజు. అతి భయంకర చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన రోజు. మొత్తం ప్రపంచం కొద్ది గంటల సేపు చీకట్లో వెళ్లిపోయింది. ట్విన్‌టవర్స్, పెంటగాన్‌లపై వరుస వైమానిక దాడులు. కరెంట్, ఇంటర్నెట్, రేడియో ఫ్రీక్వెన్సీ నిలిచిపోయింది. చరిత్రలో ఇప్పటి వరకూ నమోదైన అతిపెద్ద మారణకాండ. 11 ఎకరాల విస్తీర్ణంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్‌ను(Twin Towers) వైమానిక దాడులతో బూడిద చేసిన వైనం. దాదాపు 5 వేలమంది మృత్యువాత పడ్డారు. అమెరికా చరిత్రలో అతిపెద్ద మారణకాండగా వర్ణించే  ఈ దాడుల(9/11 Attacks) వెనుక అల్ ఖైదా హస్తముందనేది నిరూపితమైంది. ఇజ్రాయిల్‌తో అమెరికా స్నేహం, సోమాలియా, మోరో అంతర్యుద్ధం, రష్యా, లెబనాన్, కశ్మీర్‌లో హింసాత్మక ఘటనలు, ముస్లింల అణచివేత, ఇస్లాం వ్యతిరేక కుట్రలకు అమెరికా వత్తాసు పలుకుతుందనేది అల్‌ఖైదా ప్రధాన ఆరోపణ. సౌదీ అరేబియా నుంచి యూఎస్ భద్రతా దళాల మొహరింపు, ఇరాక్‌కు వ్యతిరేకంగా అంక్షలు వంటివి కూడా ప్రధాన కారణాలని అల్‌ఖైదా(Al khaida) వాదనగా ఉంది. 


దాడులు ఎలా జరిగాయి


విమానంలో నడపడంలో శిక్షణ పొందిన 19 మంది ఉగ్రవాదులు 5 మంది చొప్పున మూడు గ్రూపులు, మరో నలుగురు ఒక గ్రూప్‌గా విడిపోయారు. సెప్టెంబర్ 11వ తేదీన నాలుగు విమానాలన్ని హైజాక్ చేశారు. మొదటి ఫ్లైట్ అమెరికన్ ఎయిర్‌లైన్స్ 11 తో ఉదయం 8 గంటల 46 నిమిషాలకు మాన్ హట్టన్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్‌టవర్ ఢీ కొట్టారు. 17 నిమిషాల వ్యవధిలో రెండో విమానం యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 175 సౌత్ టవర్‌ని ఢీ కొట్టింది. కేవలం గంటా నలభై రెండు నిమిషాల్లో 110 అంతస్థుల ట్విన్‌టవర్స్ కళ్లముందే కుప్పకూలిపోయాయి. మంటలు, దట్టమైన పొగ, ఆర్తనాదాలు, ప్రాణభీతితో పైనుంచి దూకేసిన జనం అన్నీ కెమేరాల్లో రికార్డయ్యాయి. రెండు కిలోమీటర్ల మేర భవనాలు నాశనమయ్యాయి. ఇక మూడవ దాడి అదే రోజు పెంటగాన్ పశ్చిమ భాగాన్ని ఉదయం 9 గంటల 37 నిమిషాలకు జరిగింది. డల్లాస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన విమానాన్ని ఓహియో వద్ద హైజాక్ చేశారు తీవ్రవాదులు. ఇక నాలుగవ విమానం ఉదయం 10 గంటల 3 నిమిషాలకు పెన్సిల్వేనియాలోని మైదానాల్లో క్రాష్‌ల్యాండ్ అయింది. ఈ విమానం యూఎస్ పార్లమెంట్ భవనం లక్ష్యంగా వచ్చినట్టు అంచనా. 


సెప్టెంబర్ 11 దాడుల(September 11 Attacks) అనంతరం ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులొచ్చాయి. ఆసియన్ దేశాల విషయంలో పాశ్చాత్య దేశాల ధోరణి పూర్తిగా మారిపోయింది. ట్రావెల్ బ్యాన్ ఆంక్షలు, మత విద్వేషదాడుకు పెరిగిపోయాయి. దాడులకు బిన్ లాడెన్(Bin Laden) కారణంగా భావించి..అతడి కోసం అణ్వేషణ సాగింది. చివరికి అంటే దాడులు జరిగిన పదేళ్ల అనంతరం 2001 మే 1న పాకిస్తాన్‌లో అమెరికా సైన్యం నిర్వహించిన ఆపరేషన్ నెఫ్ట్యూన్ స్పియర్‌లోOperation Neptune spear) లాడెన్ హతమైనట్టు అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా(Obama) వెల్లడించారు. 


Also read: Taliban Beaten Afghan Journalists: ఆగని తాలిబన్ల అరాచకాలు..జర్నలిస్టులకు చిత్రహింసలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook