World's leggiest creature: ప్రపంచంలోనే అత్యధిక కాళ్లు కలిగిన జీవి(World's leggiest creature)ని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు(Australia scientists) కనుగొన్నారు. మిలపీడ్‌(Millipede) జాతికి చెందిన ఈ జీవి 1,306 కాళ్లను కలిగి ఉండటమే కాకుండా...95 మిల్లీమీటర్లు పొడవు ఉంది. పశ్చిమ ఆస్ట్రేలియా(Western Australia)లోని మైనింగ్ జోన్ లో 60 మీటర్ల లోతు(200 అడుగుల)లో ఈ జీవిని గుర్తించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ జీవికి గ్రీకు పాతాల దేవత పెర్సెఫోన్(persephone) పేరు మీద ‘'యుమిల్లిప్స్ పెర్సెఫోన్'’ అని నామకరణం చేశారు. ఇంతవరకు అత్యధిక కాళ్ల జీవి అనే రికార్డు సెంట్రల్ కాలిఫోర్నియా(central California)లో బయటపడిన ఇలాక్మే ప్లెనిప్స్‌(750 కాళ్లు) పేరిట ఉండేది. ''మిలపీడ్‌ అంటే 'వెయ్యి కాళ్లు' అని అర్థం. కానీ.. ఇప్పటివరకు వెలుగుచూసిన మిలపీడ్‌లకు అన్ని కాళ్లు లేవు''’అని వర్జీనియా టెక్‌కు చెందిన ప్రముఖ కీటక శాస్త్రవేత్త పాల్ మారెక్ సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో పేర్కొన్నారు. కానీ.. తాజాగా బయటపడ్డ జీవిని నిజమైన మిలపీడ్‌గా అభివర్ణిస్తున్నారు.


Also Read: UberEats: స్పేస్​లోకి పుడ్ డెలివరీ చేసిన తొలి సంస్థగా 'ఉబర్ ఈట్స్'..


‘'నా అభిప్రాయం ప్రకారం ఇది అద్భుతమైన జీవి. దీని పరిణామ అద్భుతం' అని ఆస్ట్రేలియా పెర్త్‌లోని బెన్నెలోంగియా ఎన్విరాన్‌మెంటల్ కన్సల్టెంట్స్‌లో ప్రధాన జీవ శాస్త్రవేత్త బ్రూనో బుజాట్టో(Bruno Buzatto)పేర్కొన్నారు. ‘'మిలపీడ్స్‌లో అత్యంత పొడవైంది ఇదే. భూమిని జయించిన మొదటి జీవులు ఇవి. ఈ జాతులు ప్రత్యేకించి మట్టిలో పదుల మీటర్ల లోతులో కఠినమైన వాతావరణంలో జీవించడానికి అలవాటుపడ్డాయి. భూ ఉపరితలంపై జీవించి ఉన్న మిల్లిపెడెస్ లను కనుగొనడం చాలా కష్టం' అని బుజాట్టో వెల్లడించారు. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link -https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook