UberEats: స్పేస్​లోకి పుడ్ డెలివరీ చేసిన తొలి సంస్థగా 'ఉబర్ ఈట్స్'..

UberEats: అంతరిక్షంలోకి పుడ్ డెలివరీని చేసి రికార్డు సృష్టించింది ఉబర్ ఈట్స్. ఈ ఘనత సాధించిన తొలి సంస్థగా గుర్తింపు పొందింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2021, 03:13 PM IST
UberEats: స్పేస్​లోకి పుడ్ డెలివరీ చేసిన తొలి సంస్థగా 'ఉబర్ ఈట్స్'..

UberEats Delivers Food To Space: ఆన్ లైన్ లో అర్డర్ పెట్టండి చాలు..అంతరిక్షానికైనా డెలివరీ చేస్తానంటోంది పుడ్ డెలివరీ దిగ్గజం ఉబర్ ఈట్స్(UberEats). అనుకున్న విధంగానే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోని వ్యోమగాములకు రుచికరమైన పుడ్ పంపించి ఔరా అనిపించింది. స్పేస్ లోకి తమ మెుదటి పుడ్ డెలివరీ(First Food Delivery in Space)ని డిసెంబరు 11, 2011న చేసింది. 

అనేక దేశాల్లో ఫుడ్​ డెలివరీ సేవలు అందిస్తున్న ఉబర్​ ఈట్స్.. ​అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాముల(Astronauts)కు రకరకాల ఆహార పదార్థాలను పంపించింది. వీరు పంపిన పుడ్ లో చికెన్, పంది మాంసం, మాకేరెల్ ఉండటం విశేషం. దీంతో అంతరిక్షం(Space)లోకి ఫుడ్​ డెలివరీ చేసిన తొలి సంస్థగా ఉబర్​ ఈట్స్​ చరిత్ర సృష్టించింది. 

Also Read: Dubai: ప్రపంచంలో తొలి కాగిత రహిత ప్రభుత్వంగా దుబాయ్‌!

జపాన్​కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త యుసాకు మేజావా(Yusaku Maezawa) అంతరిక్ష పర్యటనకు బుధవారం సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఉబర్​ ఈట్స్..​ వ్యోమగాములకు అందించాల్సిన ఆహార పదార్థాలను మేజావాకు ఇచ్చి పంపించింది. తొమ్మిది గంటల పాటు ప్రయాణం తర్వాత ఐఎస్​ఎస్​కు చేరుకున్న మేజావా.. అక్కడి వ్యోమగాములకు ఉబర్​ ఈట్స్​ పార్సెల్​ను అందించారు. దీనికి సంబంధించిన వీడియోను ఉబర్ ఈట్స్ ట్విట్టర్​లో షేర్​ చేసింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News