అంతరిక్షంలోకి బుల్లి రాకెట్ ను పంపిన జపాన్
ప్రపంచంలోనే అతిచిన్న రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది జపాన్.
ప్రపంచంలోనే అతిచిన్న రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది జపాన్. శనివారం కక్ష్యలోకి క్షిపణులను మోసుకెళ్లే అతిచిన్న రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించి సరికొత్త రికార్డును సృష్టించింది.
'ఈ రాకెట్ ఎస్ఎస్-520 శ్రేణికి చెందినది. ఇది 10 మీటర్లు పొడవు, 50 సెంటీమీటర్ల వ్యాసాన్ని కలిగి ఉంది. కగోషిమా ప్రిఫెక్చర్ లోని ఉచినౌరా స్పేస్ సెంటర్ నుండి బయలుదేరింది. ఇది దానికి ఉద్దేశించిన కక్ష్యకు వెళ్లి సమాచారాన్ని పంపిణీ చేసుకుంటుంది' అని జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ ప్లోరేషన్ ఏజెన్సీ (జేఏఎక్స్ఏ) పేర్కొంది. ఎస్ఎస్ -520 సిరీస్ కు చెందిన 5వ రాకెట్ మూడు కిలోగ్రాముల బరువున్న ఒక మైక్రో శాటిలైట్ ను తీసుకెళ్లినట్లు జపాన్ టైమ్స్ నివేదించింది. దీనిని టోక్యో విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది. దీని సహాయంతో భూమి ఉపరితల చిత్రాలను సేకరిస్తారు.
జేఏఎక్స్ఏ జనవరి 15, 2017న అదే సిరీస్ కు చెందిన 4వ రాకెట్ రోదసీలోకి పంపాలని ప్రయత్నించింది విఫలమైంది.