Vijayawada: ఏపీలో దీపావళికి ముందే టపాసులు మోత మోగుతుంది. రాష్ట్రప్రజలను వరుస ప్రమాదాలు బెంబేలెత్తుస్తున్నాయి. తాజాగా విజయవాడ జింఖానా మైదానంలోని బాణాసంచా దుకాణంలో అగ్నిప్రమాదం(Massive fire) సంభవించింది. క్రాకర్స్ దుకాణంలో భారీగా మంటలు ఎగిసిపడి ఇద్దరు సజీవదహనమయ్యారు. మూడు స్టాల్స్ పూర్తిగా అగ్నికి అహుతయ్యాయి. భారీ శబ్దాలుకు ప్రజలు, వ్యాపారులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. 4 పైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ  బాణసంచా దుకాణం పక్కనే పెట్రోల్ బంక్ ఉంది. అగ్నిప్రమాదానికి  గల  కారణాలపై  పోలీసులు ఆరా తీస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు ఇవాళ వైజాగ్‌లోని ఆర్‌అండ్‌బీ సమీపంలోని విశాల్‌మార్ట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి దుకాణంలో కిరాణా వస్తువులు, బట్టలు సహా వస్తువులు కాలిపోయినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. నిన్న రాత్రి తిరుపతిలోని వడమాలపేటలోని రెండు క్రాకర్స్ షాపులో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. 16 నుంచి 18 లక్షల రూపాయల విలువైన క్రాకర్లు దగ్ధమైనట్లు తిరుపతి పోలీసులు తెలిపారు. విజయనగరంలోనూ ఇలాంటి ప్రమాదమే చోటుచేసుకుంది. 


Also Read: Cyclone Sitrang: ఏపీకి తప్పిన తుఫాన్ ముప్పు.. బంగ్లాదేశ్ దిశగా దూసుకుపోతున్న సిత్రాంగ్.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook