Benefits of Amla Shots: భారతదేశం, ఆసియాలోని ఇతర ప్రాంతాలకు చెందిన పండే ఉసిరికాయ. ఇది చూడడానికి గుండ్రంగా, ఆకుపచ్చగా ఉంటుంది. ఇందులో అధిక శాతం విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. విటమిన్ సితో పాటు, ఉసిరికాయలో విటమిన్ ఎ, ఇ, కె, ఫోలేట్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఈ పండును చలికాలంలో తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జీర్ణక్రియ మెరుగుపరచడం, రోగ నిరోధక శక్తి పెంచడం, చర్మం ఆరోగ్యాన్ని కాపాడడం, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉసిరికాయకు ఉన్నాయి. ఆయుర్వేద వైద్యంలో ఉసిరికాయను అనేక రకాల ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.
ఉసిరికాయ వల్ల కలిగే ప్రయోజనాలు:
ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను తగ్గించడంలో కూడా ఎంతో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా చలికాలంలో చాలామంది మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యలను కూడా ఉసిరికాయ తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
ఉసిరికాయలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని స్వేచ్ఛా రాశుల నుంచి రక్షిస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కంటి చూపును మెరుగుపరచడంలో కూడా ఉసిరి మంచిది. ఉసిరికాయలోని క్రోమియం రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. అయితే చలికాలంలో ఉసిరికాయతో తయారు చేసే ఈ ఆమ్లా షాట్స్‌ను ప్రతిరోజు ఉదయం తీసుకోవడం మంచిది. దీని వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం కూడా. ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
ఆమ్లా షాట్స్ తయారీ విధానం
ఆమ్లా షాట్స్ అంటే ఉసిరికాయ రసాన్ని షాట్స్ రూపంలో తీసుకోవడం. ఇది చాలా సులభంగా ఇంటి వద్ద తయారు చేసుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు:
పక్వానికి వచ్చిన ఉసిరికాయలు
నీరు
తేనె
నిమ్మరసం
తయారీ విధానం:
ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, విత్తులను తీసివేయండి. శుభ్రం చేసిన ఉసిరికాయ ముక్కలను కొద్దిగా నీటితో కలిపి మిక్సీలో మెత్తగా రసం తీసుకోండి. తయారైన రసాన్ని జల్లెడ పట్టి గింజలు లేకుండా చేయండి. రుచికి తగ్గట్టుగా తేనె లేదా నిమ్మరసం కలపండి. ఈ రసాన్ని స్టెరిలైజ్ చేసిన బాటిల్‌లో నింపి రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి.
ఎలా తీసుకోవాలి:
రోజుకు ఒక షాట్ (2-3 టేబుల్ స్పూన్లు) ఉదయం లేదా రాత్రి నిద్రకు ముందు తీసుకోవచ్చు.
ముఖ్యమైన విషయాలు:
ఉసిరికాయను అధికంగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, అతిసారం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే, ఉసిరికాయను తీసుకునే ముందు వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి