DJ Sounds: దేవీ నవరాత్రుల్లో అపశ్రుతి.. డీజే శబ్ధానికి డ్యాన్స్ చేస్తూ 21 ఏళ్ల యువకుడు మృతి
Young Man Collapsed In Devi Navratri Utsav: అమ్మవారి ఊరేగింపులో డీజే సౌండ్స్‌కు తగ్గట్టు డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు కుప్పకూలిపోయాడు. సీపీఆర్ చేసినా అతడి ప్రాణం దక్కలేదు.
DJ Kills Young Man: దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉత్సాహంగా అమ్మవారి పూజా కార్యక్రమాలు, ఊరేగింపు జరిగాయి. ఉత్సవాల్లో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆనందోత్సాహాల్లో మునిగిన యువకుల్లో ఒక్కసారిగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుకు గురయిన యువకుడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయి చనిపోయాడు. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనతో నిర్వాహకులు, అక్కడి ప్రాంతవాసులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. డీజే చప్పుళ్లకు తాళలేక అతడు గుండెపోటుకు గురయి మరణించాడని వైద్యులు తెలిపారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
Also Read: Water Death: దసరా నాడు విషాదం.. బావి నీళ్లు తాగి ఇద్దరు మృతి, 30 మందికి వాంతులు, విరేచనాలు
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి దసరా సందర్భంగా డీజేలు పెట్టి అమ్మవారి ఊరేగింపు చేపట్టారు. ఈ ఊరేగింపులో అమలాపురం మండలం బండారులంక గ్రామానికి చెందిన 21 ఏళ్ల వినయ్ కూడా హాజరయ్యాడు. తన మిత్రులతో కలిసి అమ్మవారి ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా డీజే పాటలకు డ్యాన్స్‌లు వేశాడు.
Also Read: Viral Incident: ఇడ్లీలో జొర్రిన జెర్రీ.. ఎహే కాదని చెప్పి నోట్లో వేసుకున్న హోటల్ యజమాని
అయితే డీజే సౌండ్స్ మోతాదుకు మించి ఉండడంతో వినయ్ తట్టుకోలేకపోయాడు. అతడి గుండె అలసిపోయి గుండెపోటు వచ్చింది. డ్యాన్స్ చేస్తూనే గుండెను పట్టుకుని కుప్పకూలిపోయాడు. అకస్మాత్తుగా వినయ్ పడిపోవడంతో అతడి స్నేహితులతోపాటు అక్కడ ఉన్న వారు లేపి చూశారు. ఎంతకీ లేకపోవడంతో స్థానికులు సీపీఆర్ చేసి ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నం చేసినా వినయ్ స్పృహలోకి రాలేదు. వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వినయ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. డీజే సౌండ్స్‌కు తాళలేక వినయ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది. అప్పటి దాకా తమతో సంతోషంగా గడిపిన వినయ్ ప్రాణాలతో లేకపోవడంతో అతడి స్నేహితులు దిగమింగులేకపోయారు.
కాగా గతంలో కూడా ఇలాంటి సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకున్నాయి. ఇటీవల ముగిసిన వినాయక ఉత్సవాల్లో కూడా డీజే సౌండ్స్‌కు తట్టుకోలేక కొందరు మృతి చెందారు. అంతకుముందు పెళ్లి బరాత్‌లలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగి కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపాయి. వరుస సంఘటనలతో డీజే వినియోగంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మోతాదుకు మించి సౌండ్స్ వినియోగంతో అనర్థాలు చోటుచేసుకుంటుండడంతో డీజే వినియోగంపై నిషేధాజ్ఞలు వస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని హైదరాబాద్‌లో డీజే సౌండ్స్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. త్వరలో ఏపీలో కూడా నిషేధించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి