Water Death: దసరా నాడు విషాదం.. బావి నీళ్లు తాగి ఇద్దరు మృతి, 30 మందికి వాంతులు, విరేచనాలు

2 Died And 30 People Falldown After Drinking Well Water: బావి నీళ్లు తాగడంతో ఇద్దరు మృతి చెందగా.. పదుల సంఖ్యలో గ్రామస్తులు గాయపడడంతో దసరా పండుగ కన్నీటితో ముగిసింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 13, 2024, 05:12 PM IST
Water Death: దసరా నాడు విషాదం.. బావి నీళ్లు తాగి ఇద్దరు మృతి, 30 మందికి వాంతులు, విరేచనాలు

Well Water: దసరా పండుగ రోజు తెలంగాణలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. బావి నీరు తాగి పదుల సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురి కాగా.. పరిస్థితి విషమించి ఇద్దరు మృతి చెందిన సంఘటన తెలంగాణలో కలకలం రేపింది. దసరా పండుగ రోజే కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ సంఘటనతో ఒక్కసారిగా పరిసర గ్రామాల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమైంది. కాగా అస్వస్థతకు గురయిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

Also Read: Wine Shop Theft: దసరా పండుగకు లక్షల్లో మద్యం వ్యాపారం.. వైన్స్‌లోకి దూకి రూ.12 లక్షలు చోరీ

 

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం సంజీవరావుపేట గ్రామంలో బావి ఉంది. ఈ గ్రామంలోని బీసీ కాలనీ ప్రజలు శనివారం పండుగ రోజు యథావిధిగా ఆ బావి నుంచి నీరు తీసుకుని ప్రజలు తాగారు. తాగిన వారిలో దాదాపు 30 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితి గమనించి కుటుంబసభ్యులు, గ్రామస్తులు వెంటనే సంగారెడ్డిలోని ఆస్పత్రికి తరలించారు. వారు తాగిన నీరు కలుషితమైందని వైద్యులు గుర్తించారు.

Also Read: Taps Stolen: సర్కార్‌ నల్లాలు కూడా వదిలిపెట్టలేదు.. 9 లక్షల విలువైన ఇత్తడి నల్లాలు చోరీ

 

అయితే పరిస్థితి విషమించి మహేశ్‌ (22), సాయమ్మ (70) మరణించారు. ఆస్పత్రికి తరలించే లోపే వారిద్దరూ మృతి చెందారని వైద్యులు తెలిపారు. కాగా మరింత మంది గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. వాంతులు, విరేచనాలతో గ్రామస్తులంతా ఆస్పత్రి బాట పడుతున్నారు. కాగా ప్రమాదానికి కారణమైన బావిని అధికారులు పరిశీలించారు. బావిలోని నీటి నమూనాను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో బావి నీళ్లు ఎవరూ తాగవద్దని అధికారులు ప్రకటించారు. పండుగ రోజే రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. చేతికొచ్చిన యువకుడు మహేశ్‌ మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యింది. ఇరు కుటుంబాల సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కాగా మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఇద్దరి మృతితో గ్రామంలో పండుగ లేకుండాపోయింది.

మిషన్ భగీరథ లేకనే?
కాగా ఈ సంఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత నీరు తాగి ఇద్దరు మృతిచెందడంపై ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్‌ ఈ సంఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరారు. తాము అమలుచేసిన మిషన్‌ భగీరథను సక్రమంగా అమలు చేయకపోవడంతోనే ప్రజలు బావిలను ఆశ్రయించి ప్రమాదాల బారిన పడుతున్నారని చెప్పారు. వెంటనే మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. వెంటనే మిషన్‌ భగీరథ కింద ఇంటింటికి రక్షిత తాగునీరు ఇవ్వాలని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి చెప్పారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News