ఏపీలో ఒక్కరోజులో 200కు పైగా కరోనా కేసులు
కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా వలసల కారణంగా కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ (Andhra Pradesh COVID19 Cases) బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా ఏపీలో 218 కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus) నమోదయ్యాయి. దీంతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,247కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఓ కరోనా మరణం సంభవించింది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒకరు కరోనా బారిన పడి చనిపోయారు. ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో వివరాలు వెల్లడించింది. అయితే రాష్ట్రంలో ఉంటున్న వారి కేసులు, ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వస్తున్న వారి కేసులను వేరువేరుగా బులెటిన్‌లో ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో వారి ఖాతాల్లోకి రూ.10 వేలు
ఏపీ (Andhra Pradesh)లో గడిచిన 24 గంటల్లో ఏపీలో 15,384 శాంపిల్స్ పరీక్షించగా రాష్ట్రంలో ఉన్నవారిలో 136 కోవిడ్ పాజిటివ్ కేసులు, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో 82 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో చికిత్స అనంతరం 2,475 మంది డిశ్ఛార్జ్ కాగా, ప్రస్తుతం 1,573 మంది చికిత్స పొందుతున్నారు. అరటి పండు ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలుసుకోండి
కాగా, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకూ 188 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా, ఇందులో కరోనా నుంచి 18 మంది కోలుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 933 మందికి కరోనా పాజిటివ్ తేలగా, ప్రస్తుతం 557 యాక్టీవ్ కేసులున్నాయి. తాజాగా 22 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. #APFightsCorona జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్