RTC Bus-Car Collision: ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు.. చిన్నారి సహా దంపతులు మృతి!
RTC bus - Car Accident in Tirupati: ఆర్టీసీ బస్సును కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో చోటుచేసుకుంది. మృతులంతా తెలంగాణ వాసులుగా తెలుస్తోంది.
RTC Bus - Car Accident at Thitupathi: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును కారు ఢీకొన్న ఘటనలో చిన్నారి సహా దంపతులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఏర్పేడు మండలం మేర్లపాక చెరువు వద్ద తిరుపతి -శ్రీకాళహస్తి ప్రధాన రహదారిపై ఈ ఘటన ఏర్పడింది. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు.
వారిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులను తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లెకు చెందిన కుటుంబంగా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఏర్పేడు సిఐ శ్రీహరి సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు.
సేమ్ టు సేమ్ ఇలాంటి ఘటనే...
మూడు రోజుల కిందట సేమ్ టు సేమ్ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు-కారు ఢీకొన్న ఘటనలో ఒకే ఫ్యామిలీకి చెందన నలుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం కొల్చారం సమీపంలోని మెదక్-హైదరాబాద్ నేషనల్ హైవే పై జరిగింది. వీరంతా పెళ్లికి వెళ్లి కారులో తిరుగువస్తుండగా ఇది జరిగింది.
స్పాట్ లో ఇద్దరు చనిపోగా..మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో మృతి చెందారు. చనిపోయిన వారి మృతదేహాలను మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతి వేగం, అజాగ్రత్త కారణంగా రీసెంట్ రోజుల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. అధికారులు ఎన్ని రూల్స్ పెట్టిన వాహనదారులు వాటిని తుంగలో తొక్కి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
Also Read: APJAC Strike: ఉద్యోగ సంఘాలతో ఇవాళ ప్రభుత్వం చర్చలు, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook