Building Collapsed in Visakhapatnam: విశాఖలో ఘోర దుర్ఘటన జరిగింది. మూడంతస్తుల భవనం కుప్పకూలి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో నగరంలోని కలెక్టరేట్ సమీపంలో గల రామజోగిపేటలో చోటుచేసుకుంది. రెస్క్యూ సిబ్బంది ఎంతో శ్రమించి మృతదేహాలను బయటకు తీశారు. మృతులు అంజలి, దుర్గాప్రసాద్ మరియు బీహార్ కు చెందిన చోటు అనే వ్యక్తిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో సాకేటి రామారావు, సాకేటి కల్యాణి, కొమ్మిశెట్టి శివశంకర, సాతిక రోజారాణి, సున్నపు కృష్ణ ఉన్నారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని ఫైర్ మరియు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు వెలికి తీస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో  చుట్టుపక్కల ఉన్న ప్రజలు  భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమయంలో భవనంలో మెుత్తం ఎనిమిది మంది ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పోలీసులు కేజీహెచ్ కు తరలించారు. ఘటనాస్థలాన్ని డీసీపీ సుమిత్ గరుడ పరిశీలించారు. ఈ ప్రమాదంపై పూర్తిస్థాయిలో విచారణ జరపనున్నట్లు ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన అంజలి, దుర్గాప్రసాద్ అన్నాచెల్లిలుగా గుర్తించారు. క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.  గాయపడిన వారికి అన్ని పరీక్షలు నిర్వహించి.. రిపోర్ట్స్ ను బట్టి తర్వాత ఏం చేయాలనేది చూస్తామని కేజీహెచ్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్ తెలిపారు. 


Also Read: Heavy Rains Alert Telugu States: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. మరో 48 గంటలు కొనసాగనున్న వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook