దొంగనోట్లు (Fake Currency) ముద్రిస్తున్న ముఠా ఆట కట్టించారు రాష్ట్ర పోలీసులు. నకిలీ నోట్లు ముద్రిస్తున్న గ్యాంగ్ సభ్యులు నలుగురిని ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు (West Godavari Police) శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఛేబ్రోలు పోలీసులు రూ.1.49లక్షల నగదుతో పాటు రెండు కలర్ ప్రింటర్లను స్వాధీనం చేసుకున్నారు.  నేటి రాత్రి చంద్రగ్రహణం.. మూడు గంటలకు పైగా అకాశంలో అద్భుతం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జిల్లాలోని నారాయణపురం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు తెల్ల రంగు కాగితాలను తీసుకెళ్లి కలర్ ప్రింటర్ ద్వారా నకిలీ కరెన్సీ నోట్లను ముద్రిస్తున్నారు. ఈ నగదును చిన్న చిన్న కిరాణా దుకాణాలలో మార్పిడి చేస్తున్నారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు అకస్మాత్తుగా దాడిచేసి దొంగనోట్ల ముఠాను అదుపులోకి తీసుకున్నారని ఏలూరు డీఎస్పీ దిలీప్ కుమార్ తెలిపారు. డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు


ఛేబ్రోలు పోలీస్ స్టేషన్‌లో నకిలీ నోట్ల గ్యాంగ్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి తాము ఒరిజినల్ నోట్లలా ప్రింటింగ్ చేస్తున్నట్లు నిందితులు వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్సీ వివరించారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
గ్లామర్ డాల్ సెక్సీ ఫొటోలు వైరల్
  
బీ అలర్ట్.. గంటల తరబడి కూర్చుంటున్నారా! ఇది చదవండి