Guntur Minor rape case: గుంటూరులో దారుణం... మైనర్ బాలిక అత్యాచారం కేసులో 64 మంది అరెస్ట్
Guntur Minor rape case: గుంటూరు జిల్లా మైనర్ బాలిక అత్యాచారం కేసులో ఇప్పటివరకు 64 మందిని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Guntur Minor rape case: గుంటూరు జిల్లా మైనర్ బాలిక అత్యాచారం కేసులో (Minor rape case) దర్యాప్తు చేసే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో మరికొంతమంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 64 మందిని అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగిందంటే..
గతేడాది జూన్ లో గుంటూరులో (Guntur) ఓ కుటుంబానికి చెందిన తల్లికూతుళ్లకు కొవిడ్ (covid-19) సోకింది. చికిత్స నిమిత్తం జీజీహెచ్ లో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ...తల్లి మృతి చెందింది. ఈ క్రమంలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న మైనర్ బాలికకు స్వర్ణకుమారి పరిచయమైంది. బాలికకు మాయమాటలు చెప్పి...నాటువైద్యం ద్వారా కరోనాను తగ్గిస్తానని నమ్మబలికింది. తండ్రి అనుమతితో బాలిక స్వర్ణకుమారి వెంట వెళ్లింది.
వ్యభిచార కూపంలోకి దించి..
కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ బాలికను వ్యభిచార కూపంలోకి దించింది స్వర్ణకుమారి. ఏపీలోని పలు నగరాలతో పాటు హైదరాబాద్ లోని పలు వ్యభిచార గృహాల్లో ఉంచి వ్యభిచారం చేయించింది. ఆరు నెలలు గడిచింది. బాలిక ఆరోగ్యం క్షీణించింది. ఈ క్రమంలో సదరు మహిళ నుండి బాలిక తప్పించుకుని తండ్రి వద్దకు చేరింది.
ప్రత్యేక బృందాలతో గాలింపు...
బాలిక తండ్రి ఫిర్యాదుతో పోలీసుల కేసు నమోదు చేసి దర్యాపు ప్రారంభించారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్.. వ్యభిచార ముఠాను పట్టుకునేందుకు పక్కా స్కెచ్ వేశారు. స్వర్ణకుమారి తో పాటు 23 మందిని అదుపులోకి తీసుకుని.. వీరిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. జడ్జి శ్రీలత ఈ కేసులో ఉన్నవారందరిని అరెస్టు చేయాలని ఆదేశించింది. దీంతో పోలీస్ ప్రత్యేక బృందాలు తీవ్రంగా గాలించి..ఇప్పటి వరకు 64 మందిని అరెస్ట్ చేసింది.
Also Read: AP New DGP: గౌతమ్ సవాంగ్ బదిలీ.. ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook