Rashmika Mandanna: తనకు కాబోయే భర్త ఎవరో లీక్ చేసిన రష్మిక మందన్నా.. అతడేనా?

Rashmika Mandanna Leaks Everyone Knows About Of Her Marriage: ఇప్పటికే ఒకరితో ప్రేమలో ఉందనే పుకార్లు విస్తృతంగా సాగుతున్న వేళ నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా బాంబు పేల్చింది. తనకు కాబోయే వాడి గురించి లీక్‌ ఇచ్చేసింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 24, 2024, 11:58 PM IST
Rashmika Mandanna: తనకు కాబోయే భర్త ఎవరో లీక్ చేసిన రష్మిక మందన్నా.. అతడేనా?

  Pushpa 2 The Rule: క్యూట్‌ క్యూట్‌ హావభావాలతోపాటు హాట్‌ హాట్‌ సీన్లతో ప్రేక్షకులను కట్టి పడేసి నేషనల్‌ క్రష్‌గా ఎదిగిన రష్మిక మందన్నా సంచలన విషయాన్ని బయటపెట్టింది. పుష్ప 2 ది రూల్‌ సినిమా ఈవెంట్‌లో పాల్గొని తన జీవితంలోని కీలక ఘట్టానికి సంబంధించిన ప్రకటనను చేసింది. ఇప్పటికే కొన్నేళ్లుగా ఒకరితో ప్రేమలో ఉందనే ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారాన్ని మరింత పెంచేలా రష్మిక ఒక లీక్‌ ఇచ్చింది. దానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ఇది చదవండి: Kissik Song: ఏపీ రాజకీయాల్లో పుష్ప 2 'కిస్సిక్' పాట రచ్చ.. వారికి అల్లు అర్జున్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌?

Add Zee News as a Preferred Source

తమిళనాడులోని చెన్నైలో ఆదివారం 'పుష్ప వైల్డ్‌ఫైర్‌' వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీలీలకు సంబంధించిన ఐటమ్‌ సాంగ్‌ 'కిస్సిక్‌' లిరికల్‌ పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌, శ్రీలీలతోపాటు రష్మిక మందన్నా హాజరై సందడి చేసింది. వేడుకలో భాగంగా స్టేజీ పైకి ఎక్కగా అక్కడ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న వారు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ క్రమంలోనే పెళ్లికి సంబంధించిన ప్రశ్నను కూడా అడగడంతో రష్మిక మొదట సమాధానం చెప్పేందుకు కొంత ఆలోచించింది. ఆ తర్వాత నవ్వుతూనే 'మీ అందరికీ తెలిసిందే' అంటూ ఒక లీక్‌ ఇచ్చింది.
ఇది చదవండి: Pushpa 2 wildfire event: కిస్సిక్ సాంగ్ విడుదల.. హైలెట్ గా నిలిచిన శ్రీలీల.. రష్మికపై సెటైర్

'మీరు సినీ పరిశ్రమలోని వారిని పెళ్లి చేసుకుంటారా? లేదంటే బయటి వ్యక్తులనా?' అని హోస్ట్‌ ప్రశ్నించగా.. 'అది అందరికీ తెలిసిన విషయమే' అంటూ రష్మిక చెప్పడంతో ఈవెంట్‌ మొత్తం నవ్వులు.. కేకలు భారీగా వచ్చాయి. నవ్వుతూ.. సిగ్గు పడుతుండగా 'ఏంటి నిజమా. ఇది మాకు తెలియదు. ఒక చిన్న హింట్‌ ఇవ్వండి' అని హోస్ట్‌ అడగ్గా.. 'అలా చెప్పడం సరికాదు. పర్సనల్‌గా చెబుతా' అంటూ రష్మిక రష్మిక నవ్వుతూ చెప్పేసింది.

ఈ వేడుకలో రష్మిక చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలతోపాటు ప్రేక్షకుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రష్మిక చెబుతోంది 'విజయ్‌ దేవరకొండ' విషయమే అని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. ఇదే రోజు విజయ్‌తో రష్మిక ఓ హోటల్‌లో కలిసి తింటున్నది బయటకు వచ్చింది. కొన్ని గంటలకే రష్మిక 'అందరికీ తెలిసిందే' అని వ్యాఖ్యానించడంతో విజయ్‌తో ఆమె డేటింగ్‌లో ఉందని అర్థమవుతోంది. గతంలో ఓ సినిమా వేడుకలో విజయ్‌ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండతో రష్మిక చేసిన వ్యాఖ్యలు కూడా ఇదే అర్థాన్నిచ్చాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

  

  

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News