AP Omicron: ఏపీలో కొత్తగా 7 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు... 24కి చేరిన కేసుల సంఖ్య..
AP Omicron: ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మెుత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కి చేరింది.
AP Omicron Cases: ఏపీలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు (AP Omicron cases) వెలుగుచూశాయి. దీంతో ఏపీలో మెుత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కి చేరింది. ఒమిక్రాన్ సోకిన వారిలో ఒమన్ నుంచి వచ్చిన ఇద్దరు మహిళలు, దుబాయ్ నుంచి ఇద్దరు, అమెరికా, సుడాన్, గోవా నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
మరో వైపు రాష్ట్రంలో కరోనా కేసుల (Corona Cases in AP) సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 28,311 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 334 మందికి వైరస్ పాజిటివ్ గా నిర్ధరణ అయింది. వైరస్ తో ఒకరు మృతి చెందారు. కొవిడ్ నుంచి మరో 95 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,516 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది.
Also read: Andhra Pradesh: పాఠశాలలో కరోనా కలకలం...టీచర్ సహా 19 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్!
దేశంలో కూడా కరోనా కేసులు (Corona Cases in India) భారీగా నమోదవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 37,379 కేసులు వెలుగుచూశాయి. వైరస్ తో 124 మంది ప్రాణాలు కోల్పోయారు. 11,007 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.24 శాతంగా ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 13లక్షల 32వేల 854 కేసులు వెలుగులోకి వచ్చాయి. వైరస్ తో 2,952 మంది ప్రాణాలు కోల్పోయారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి