Small Business Ideas: ఎవరి తెలియని కొత్త వ్యాపారం.. రోజుకు రూ.5,600 సంపాదించే అవకాశం.. సంక్రాంతికి ముందే ప్రారంభించండి..

Amazing Small Business Ideas: ఈ రోజుల్లో అవకాశాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఏ వ్యాపారాన్ని ప్రారంభించాలనేది నిర్ణయం తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ వ్యాపార నిపుణుల ప్రకారం బిజినెస్‌ ప్రారంభించడానికి పెద్ద పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు చిన్న పెట్టుబడితో కూడా పెద్ద పెద్ద బిజినెస్‌లను స్టార్ట్ చేయవచ్చు. మీరు కొత్తగా బిజినెస్‌ ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా..? అయితే  ఈ అరటి పండు పొడి వ్యాపారం మీకోసం..

1 /8

ప్రస్తుతం మార్కెట్‌లో ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడే పౌడర్‌లకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా జిమ్‌కు వెళ్లేవారు, డైట్ పాటించేవారు ఈ పౌడర్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ పౌడర్‌లు మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు మొదలైన పోషకాలను సులభంగా అందిస్తాయని చాలా మంది ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

2 /8

 ఈ పౌడర్‌లు వివిధ రకాలుగా మార్కెట్‌లో అమ్ముతున్నారు.  కొన్ని పౌడర్‌లు జీవక్రియను వేగవంతం చేసి, కొవ్వును కరిగించడానికి,  కండరాల పెరుగుదలకు, మరమ్మతుకు,  శారీరక శ్రమ తర్వాత శరీరాన్ని తిరిగి చురుగ్గా చేయడానికి ఇలా వివిధ రకాలుగా  పౌడర్‌లను అమ్ముతున్నారు. 

3 /8

 మీరు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ద చూపించేవారు అయితే మీ ఆసక్తిని వ్యాపారంగా మార్చుకోవడానికి ఇది బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా. ఇది అరటిపండుతో తయారు చేసే పౌడర్‌. ఇది ముఖ్యంగా పిల్లలకు ఎంతో సహాయపడుతుంది. 

4 /8

బనానా పౌడర్ జీర్ణవ్యవస్థ మెరుగుపరుచుతుంది, బీపీని కంట్రోల్‌చేయడంలో కూడా ఎంతో సహాయపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ హెల్దీ పౌడర్‌ ను ఇంట్లోనే తయారు చేసుకొని మార్కెట్‌లో అమ్మవచ్చు. 

5 /8

ఈ బిజినెస్‌ స్టార్ట్‌ చేయడం కోసం ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు అతి తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందవచ్చు. ఈ వ్యాపారం అరటి సాగు చేసే రైతులు కూడా ఉపయోగపడుతుంది. 

6 /8

 ఈ వ్యాపారం కోసం రూ. 15000 నుంచి రూ.  18000 ఖర్చు పడుతుంది. దీంతో అరటిపండ్లను ఆరబెట్టడానికి, అరటిపండ్లను కలపడానికి కొన్ని మషిన్‌లను కొనుగులు చేయాల్సిన ఉంటుంది. 

7 /8

ఈ బిజినెస్‌ కోసం మీరు ప్రభుత్వ లోన్‌లను కూడా పొందవచ్చు. దీంతో అరటిపండు పౌడర్‌ను తయారు చేసి మార్కెట్‌లో అమ్మవచ్చు. ఈ పొడిని రూ. 800 నుంచి రూ. 1000 వరకు అమ్ముకోవచ్చు.

8 /8

రోజుకు 7 కిలోల పొడిని తయారు చేస్తే సుమారు రూ. 4000 నుంచి రూ. 5600 వరకు సంపాదించవచ్చు. ఈ బిజినెస్‌కు లైసెన్స్ పొందాల్సి ఉంటుంది.