ప.గో: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై  పోలీసులు కేసు నమోదు చేశారు. ‘ఇంటింటికి టీడీపీ’లో కార్యక్రమంలో సమస్యలు విన్నవించుకునేందుకు వచ్చిన తమపై దౌర్జన్యం చేశారని బాధితుల ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే చింతమనేనితో పాటు ఆయన అనుచరులపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘ఇంటింటికి టీడీపీ’లో కార్యక్రమంలో భాగంగా కొన్ని రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం మాదేపల్లి శివారు లింగారావుగూడెంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైనేజ్, రోడ్డు సమస్యలపై కొందరు స్థానికులు ఎమ్మెల్యే చింతమనేనిని నిలదీశారు. ఈ సందర్భంగా  స్థానికులు-ఎమ్మల్యే చింతమనేని అనుచరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.  తమ సమస్యలు విన్నవించుకుంటే మహిళలు, చిన్నారులపై ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దౌర్జన్యం చేశారని ఆరోపిస్తూ బాధితులు  దెందులూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 


ఇది వైసీపీ కుట్ర..


టీడీపీ ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం  'ఇంటింటికి టీడీపీ' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని... ఇది విజయవంతమైతే తమ మనుగుడ ఉండదని భావించిన వైసీపీ..ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ కుట్రలో భాగాంగానే తమ ప్రచారానికి వచ్చిన తమ నేతలపై వైసీపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.