ఆధార్‌తో ఉన్న ప్రయోజనాల గురించి మనకు తెలిసిందే. అయితే దీని వల్ల కలిగే మరో ప్రయోజనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైనా తప్పిపోయిన చిన్నారులు మనకు తారసపడితే.. సాధారణంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తుంటాం.. అయితే ఇక నుంచి పోలీస్ స్టేషన్ వెళ్లకుండానే ఆ చిన్నారి ఊరు, పేరు, అతని తల్లిదండ్రుల వివరాలు.. అడ్రస్ ఇలా అన్ని వివరాలు క్షణాల్లో  తెలుసుకొని వారి తల్లిదండ్రులకు అప్పగించవచ్చు.


ఇదెలా సాధ్యమనుకుంటున్నారు కదూ.. తప్పిపోయిన చిన్నారి పేరు మీద ఆధార్ కార్డు నమోదు అయినట్లయితే ఆధార్ సెంటర్ కు వెళ్లి ఆధార్ కార్డు స్కానర్ పై చేయిపెట్టాలి.. నిమిషాల్లో ఆ చిన్నారి అడ్రస్ మనకు ఇట్టే తెలిసి పోతుంది.. తద్వారా చిన్నారిని అతని తల్లదండ్రులకు అప్పగించడం ఈజీ అవుతుంది..