Aarogyasri Card Issed With In 8 Hours in AP | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఏడాదిన్నర కాలంలో ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు, ప్రథకాలు తీసుకొచ్చింది. పలు వర్గాల శ్రేయస్సు కోసం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో సీఎం వైఎస్ జగన్ నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. అందుకు తాజాగా జరిగిన సంఘటనే నిదర్శనం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆసుపత్రిలో చేరిన ఓ గర్భిణీకి కేవలం 8 గంటల వ్యవధిలో ఆరోగ్యశ్రీ కార్డును అధికారులు మంజూరు చేశారు. ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన గర్భిణీకి ఆరోగ్యశ్రీ కార్డు అవసరం కావడంతో గ్రామ సచివాలయం సిబ్బంది ఎనిమిది గంటల వ్యవధిలో నేరుగా ఆస్పత్రికి వెళ్లి రాత్రి 11 గంటల సమయంలో ఆరోగ్యశ్రీ కార్డు(Aarogyasri Latest News) అందించారు. విజయనగరం జిల్లా సిబ్బంది  ప్రశంసలు పొందుతున్నారు.


Also Read: AP: ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డకు అంత తొందరపాటెందుకు? అంబటి రాంబాబు



విజయనగరం జిల్లా తెర్లాం మండలానికి చెందిన పైల ధనలక్ష్మి అనే గర్భిణీ ప్రసవం కోసం శ్రీకాకుళం(Srikakulam) జిల్లా రాజాంలోని కేర్ ఆసుపత్రిలో గురువారం ఉదయం చేరింది. అయితే చికిత్స చేసేందుకు ఆరోగ్యశ్రీ కార్డు అవసరమని వైద్యులు ఆమె కుటుంబానికి సూచించారు. కార్డు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ కార్డు కోసం గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసి అధికారుల సహాయం కోరారు. వారు గంటల వ్యవధిలో ఆరోగ్యశ్రీ కార్డు జారీ చేయడంతో పాటు ఆస్పత్రికి వెళ్లి అందజేశారు.


Also Read: EPF Wage Ceiling: ఈపీఎఫ్ పరిమితి రూ.15,000 నుంచి రూ.21,000కు పెంచే యోచనలో ప్రభుత్వం



అత్యవసర సమయంలో సత్వరమే స్పందించి తమకు సహాయం చేసిన సచివాలయ అధికారులు, సిబ్బందికి గర్భిణీతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో గతంలోనూ రేషన్ కార్డును అతి తక్కువ సమయంలో జారీ చేయడం తెలిసిందే.


Also Read: PPO: కేంద్రం శుభవార్త.. పెన్షన్ కోసం ఇక ఆ సమస్య ఉండదు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook