AP: ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డకు అంత తొందరపాటెందుకు? అంబటి రాంబాబు

Andhra pradesh: ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం పంచాయితీ కొనసాగుతోంది. అధికారపార్టీ నేతలు ఒక్కొక్కరిగా ఎస్ఈసీ నిమ్మగడ్డ వైఖరిపై మండిపడుతున్నారు. 

Last Updated : Jan 23, 2021, 05:51 PM IST
AP: ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డకు అంత తొందరపాటెందుకు? అంబటి రాంబాబు

Andhra pradesh: ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం పంచాయితీ కొనసాగుతోంది. అధికారపార్టీ నేతలు ఒక్కొక్కరిగా ఎస్ఈసీ నిమ్మగడ్డ వైఖరిపై మండిపడుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల ( Ap Local Body Elections ) విషయంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( SEC Nimmagadda Ramesh Kumar ) ‌తో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రారంభమైన వివాదం పరిష్కారమయ్యే సూచనలు కన్పించడం లేదు. ఎన్నికలు నిర్వహణపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల్ని హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేస్తూ..ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో హైకోర్టు ( Ap High court ) నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు ( Supreme court ) ను ఆశ్రయించింది ప్రభుత్వం.

అటు హైకోర్టు ఉత్తర్వుల ఆధారంగా షెడ్యూల్ మరోసారి ప్రకటించి..హడావిడిగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడే కాకుండా మీడియా సమావేశం ముందు ప్రత్యక్షమయ్యారు నిమ్మగడ్డ్ రమేశ్ కుమార్ ( Nimmagadda Ramesh kumar ). నిమ్మగడ్డ ఈ వ్యవహారశైలిలో వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మూడేళ్ల పాటు నిద్రపోయిన ఎన్నికల సంఘం.. మూడు నెలల కోసం ఎందుకు తొందరపడుతోందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే  అంబటి రాంబాబు ( Ambati Rambabu ) ప్రశ్నించారు. చంద్రబాబుకు అనుకూలమైన అధికారులతో..ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ చూస్తున్నట్టు ఆరోపించారు. నిమ్మగడ్డ మీడియా సమావేశం పూర్తిగా  పొలిటికల్‌ ప్రెస్‌మీట్‌లా అనిపించిందన్నారు. పంచాయితీ ఎన్నికల నిర్వహణపై అంతగా చిత్తశుద్ధి ఉంటే.. 2018లో పంచాయతీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని అడికారు. చంద్రబాబు ( Chandrababu ) అధికారంలో ఉన్నప్పుడు.. ఈ న్యాయపోరాటం ఎక్కడికి పోయిందని నిలదీశారు రాంబాబు.  కేవలం అహంకారంతోనే ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చారని అంబటి రాంబాబు దుయ్యబట్టారు. ప్రభుత్వానికి ప్రజలు, ఉద్యోగుల ప్రాణాలు ముఖ్యమని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ ( Corona vaccination )‌, ఎన్నికలు ఒకేసారి నిర్వహించటం సాధ్యం కాదని తెలిపారు. వ్యాక్సినేషన్‌ ముఖ్యమా? ఎన్నికలు ముఖ్యమా? అని ప్రశ్నించారు.  

Also read: Pawan Kalyan in Swamy attire: స్వామీజీ అవతారంలో పవన్ కల్యాణ్.. ఫోటోలు వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News