Chandrababu Case: చంద్రబాబు హౌస్ కస్టడీపై తీర్పు రేపటికి వాయిదా
Chandrababu Case: చంద్రబాబు హౌస్ కస్టడీ పిటీషన్‌పై ఏసీబీ కోర్టు తీర్పు వాయిదా పడింది. ఉదయం నుంచి సుదీర్ఘంగా సాగిన వాదనల అనంతరం న్యాయమూర్తి తీర్పు రేపటికి వాయిదా వేశారు. హౌస్ కస్టడీ పిటీషన్ వివరాలు ఇలా ఉన్నాయి..
Chandrababu Case: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే రిమాండ్‌ను హౌస్ కస్టడీగా మార్చాలంటూ దాఖలైన పిటీషన్‌పై ఇవాళ మరోసారి సుదీర్ఘ వాదనలు కొనసాగాయి.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో నిన్న అర్ధరాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే తన రిమాండ్ పిటీషన్‌ను హౌస్ అరెస్టుగా పరిగణించాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటీషన్‌పై ఇవాళంతా వాదనలు జరిగాయి. సీఐడీ తరపున అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి వాదనలు విన్పించగా, చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా వాదించారు.
చంద్రబాబుకు జైలులో ప్రమాదముందని..గతంలో కూడా ఆయనపై హత్యాయత్నం జరిగిందని కోర్టుకు వివరించారు సిద్దార్ధ్ లూథ్రా. చంద్రబాబుకు జైలులో కల్పించిన భద్రతపై అనుమానముందని చెప్పారు. హౌస్ కస్టడీకు సంబంధించి సుప్రీంకోర్టులో గౌతం సవార్కర్ కేసును ఈ సందర్భంగా సిద్ధార్ధ్ లూథ్రా ప్రస్తావించారు. అయితే చంద్రబాబుకు ఇంట్లో కంటే జైళ్లోనే భద్రత ఎక్కువగా ఉందని సుధాకర్ రెడ్డి వివరించారు. చంద్రబాబు ఆరోగ్యం కూడా బాగానే ఉందని చెప్పారు జైలు లోపల, బయట రెండు చోట్లా భద్రత ఉందన్నారు. అవసరమైన వైద్య సదుపాయాలు అందించడమే కాకుండా కోర్టు ఆదేశాల మేరకు ఇంట్లోంచి భోజనం అందిస్తున్నామన్నారు.
మొత్తానికి చంద్రబాబు హౌస్ కస్టడీ విషయంలో ఇవాళ అంతా పెద్దఎత్తున వాదోపవాదనలు కొససాగాయి. మూడు విడతలుగా వాదన జరిగింది. రిమాండ్‌ను హౌస్ కస్టడీగా మార్చాల్సిన అవసరం లేదని సీఐడీ తెలిపింది. అన్ని వివరాలు సానుకూలంగా విన్న ఏసీబీ కోర్టు తీర్పు రేపటికి వాయిదా వేసింది. అదే సమయంలో ఇరువర్గాల న్యాయవాదుల్ని రేపు మరోసారి కోర్టుకు రావల్సిందిగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook