విజయవాడ : నగరంలో అక్రమ నిర్మాణాలపై అవినీతి నిరోదక శాఖ ఉక్కుపాదం మోపుతోంది. బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్‌తో కలిసి ఇప్పటికే తనిఖీలు చేపట్టిన ఏసీబీ ఏఎస్పీ మహేశ్వర రాజు.. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. అంతేకాకుండా నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు చేపట్టిన వారికి అనుమతులు మంజూరు చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులపై చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. అంతేకాకుండా అక్రమ నిర్మాణాలను చూసీచూడనట్టు వ్యవహరించిన అధికారులను సైతం ప్రశ్నించనున్నట్టు ఆయన స్పష్టంచేశారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్లే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని మహేశ్వర రాజు పేర్కొన్నారు.


తనిఖీలు పూర్తయిన అనంతరం అక్రమ నిర్మాణాల వెనుకున్న అవినీతి, అందుకు బాధ్యులైన వారి గురించి పూర్తి సమాచారంతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నట్టు మహేశ్వర రాజు వెల్లడించారు. ముఖ్యంగా బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్స్, లైన్‌మెన్‌ల నిర్లక్ష్యాన్ని వెలుగులోకి తీసుకురానున్నట్టు ఆయన తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..