Ys jagan-Adani: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ఇవాళ ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వచ్చిన ఆయన రోడ్డు మార్గం ద్వారా తాడేపల్లి చేరుకుని ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచంలోని బడా పారిశ్రామిక వేత్తల్లో ఒకరైన గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్..ఏపీలో ఇప్పటికే కృష్ణపట్నం, గంగవరం పోర్టుల్ని నిర్వహిస్తోంది. దీనికి తోడు కొత్తగా విశాఖపట్నంలో మెగా డేటా హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో సైతం అదానీ గ్రూప్ ప్రతినిధులు హాజరై రాష్ట్రంలో చేపట్టనున్న పలు ప్రాజెక్టులపై హామీలిచ్చారు. ఈ పెండింగు ప్రాజెక్టుల్ని ఖరారు చేయడంలో భాగంగానే గౌతమ్ అదానీ ఇవాళ ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయినట్టు తెలుస్తోంది. 


అదానీ గ్రూప్‌కు ఏపీ చాలా కీలకమైన రాష్ట్రం. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో రెండు పోర్టులతో పాటు పవర్ ప్లాంట్లు, అదానీ విల్మార్ వంట నూనెల పరిశ్రమలు ఉన్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నేపధ్యంలో అదానీ గ్రూప్ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్-గౌతమ్ అదానీ భేటీలో రాష్ట్రంలో పెట్టుబడులపై కీలక చర్చ జరిగినట్టు సమాచారం. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో అదానీ గ్రూప్ తీసుకునే నిర్ణయం ఏపీకు గుడ్‌న్యూస్ కానుంది. గతంలో ప్రతిపాదించినవి మొదలుపెట్టినా లేదా కొత్తవి తలపెట్టినా ప్రభుత్వానికి మైలేజ్ కాగలదు. 


Also read: Judges Trolling Case: న్యాయమూర్తిని దూషించిన టీడీపీ నేత అరెస్ట్, ఇవాళ కోర్టులో హాజరుపర్చే అవకాశం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook