Tirumla Temple: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్‌ కావడంతో స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. దీంతో క్యూలైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. క్యూలైన్లలోనే భక్తులకు అన్ని వసతులు కలిగేలా చర్యలు తీసుకుంటున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేశారు. మరోవైపు సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను రేపు(జూన్ 27) విడుదల చేయనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను నేరుగా బుక్‌ చేసుకునే అవకాశం ఉంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన టికెట్లను ఆన్‌లైన్ ఎలక్ట్రానిక్ డిప్‌ విధానంలో కేటాయిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు.


ఈసేవలను బుక్‌ చేసుకునేందుకు రేపటి(జూన్ 27) ఉదయం 10 గంటల నుంచి జూన్‌ 29 ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ఎలక్ట్రానిక్‌ డిప్‌ విధానంలో టికెట్ల కేటాయింపు ఉంటుంది. టికెట్లు పొందిన వారి జాబితాను ఈనెల 29న మధ్యాహ్నం 12 గంటల తర్వాత వెబ్‌సైట్‌లో పొందపరుస్తారు. టికెట్లు పొందిన తర్వాత రెండు రోజుల్లోపు టికెట్ ధర చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. ఈమేరకు టీటీడీ అధికారులు ప్రకటనను విడుదల చేశారు.


Also read: KCR VS TAMILSAI: సీఎం కేసీఆర్ కు రాజ్ భవన్ ఆహ్వానం.. కొత్త సీజే ప్రమాణానికి హాజరవుతారా! డుమ్మా కొడితే సంచలనమే?


Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు..వాతావరణ శాఖ ఏం చెబుతోంది..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.