Ap Executive Capital: విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ మార్గం సుగమం కానుందా, సుబ్బారెడ్డి వ్యాఖ్యలేంటి
Ap Executive Capital: ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా విశాఖపట్నంకు మార్గం సుగమమౌతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. జరుగుతున్న పరిణామాలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం..
Ap Executive Capital: ఏపీ మూడు రాజధానుల అంశం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ఇది తేలితేనే గానీ విశాఖపట్నం ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అవుతుందో లేదో తెలుస్తుంది. కానీ త్వరలోనే దీనికి మార్గం సుగమం కానుందని తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు ఈ సందర్భంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఏపీ పరిపాలనా రాజధానిగా విశాఖపట్నానికి త్వరలో మార్గం సిద్ధం కానుంది. త్వరలోనే విశాఖపట్నం ఏపీ పరిపాలన రాజధాని కానుందని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం న్యాయపరమైన అంశాలున్నందునే ఆలస్యం అవుతోందని చెప్పారు. మరో 2-3 నెలల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖపట్నం రానున్నారని..త్వరలో విశాఖపట్నం పరిపాలనా రాజధాని కానుందని సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. విశాఖపట్నం అని ప్రాంతాలకు అనువైన ప్రదేశమని..దక్షిణ బారతదేశపు ముంబై అని తెలిపారు.
ఇటు దసరా నాటికి అంటే అక్టోబర్ 24 ముహూర్తాన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రుషికొండకు మకాం మార్చనున్నారు. దీనికి సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పరిణామాల నేపద్యంలో విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా మార్గం సుగమం కానుందనే సమాధానం విన్పిస్తోంది.
మరోవైపు పుంగనూరు టీడీపీ శ్రేణుల దాడి ఘటనపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. 2019లో చంద్రబాబు ఏంటో చూసిన తరువాత ఆయనపై దాడి చేయాల్సిన అవసరం ఎందుకుంటుందని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు మాటల్ని ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని తప్పుడు ప్రచారం జరుగుతోందని విమర్శించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook