Alla Ramakrishna Reddy Comments: వైఎస్ రాజశేఖరరెడ్డి వారసురాలు షర్మిల వెంటే తన రాజకీయ ప్రయాణం అని ఇటీవల మంగళగిరి ఎమ్మెల్యే పదవికి, వైసీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. తాను ఏ పార్టీలో ఉంటాను అనేది కాలం నిర్ణయిస్తుందన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా అనంతరం ఆయన తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. వైసీపీకి ఎంత సేవ చేశానో తనకు తెలుసని.. ఆ పార్టీ కోసం సర్వస్వం పొగొట్టుకున్నానని చెప్పారు. వైఎస్ షర్మిలమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా.. ఆమె వెంటే ఉంటానని అన్నారు. తాను వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తిని అని.. తాను షర్మిలను కలిసినట్లు తెలిపారు. వైసీపీకి సిద్దాంతాలు ఉండాలని.. ఎంచుకున్న అభ్యర్థులను ఓడించాలంటే ఆ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి చేయాలని సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యనించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"మంగళగిరి ప్రజలు అభివృద్ధినీ కోరుకుంటున్నారు. రూ.1200 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి.. కేవలం రూ.120 కోట్లను మాత్రమే కేటాయించారు. 50 ఏళ్లలో జరగని అభివృద్ధి  నాలుగేళ్లలో చేసి చూపించాను. మంగళగిరి అభివృద్ధికి నిధులు విడుదల కాలేదు. కాంట్రాక్టర్లు నాపై ఒత్తిడి తెచ్చినా.. నేను CMOకు పదే పదే వెళ్లి అడిగాను." అని ఆర్కే చెప్పారు. తానే స్వయంగా రూ.8 కోట్ల వరకు బయట అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చినట్లు చెప్పారు. తన సొంత డబ్బులతో MTMC, దుగ్గిరాల పరిధిలో అభివృద్ధి పనులు చేసినట్లు వివరించారు.


నారా లోకేశ్‌ను ఓడించిన తనకు సహకారం అందించకపోతే ఎలా..? అని ఆయన ప్రశ్నించారు. తాను ఎవరిని నిందించడం లేదని.. నిధులు మంజూరు చేస్తామని ధనుంజయ రెడ్డి చాలాసార్లు మెసేజీలు పెట్టారని.. ఎన్నికలు దగ్గరకు వచ్చినా ఎప్పుడు నిధులు మంజూరు చేస్తారని నిలదీశారు. తాను స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖ రాశానని.. రాజీనామా ఆమోదించకపోవడం అనేది వాళ్ల ఇష్టమన్నారు. మంగళగిరి ప్రజలకు తాను దూరంగా ఉండనని.. ఎవరు గెలవాలనేది ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. తాను ఏ పార్టీలో చేరినా.. ఆ రోజు తన నిర్ణయం చెప్తాని అన్నారు.


"నేను చేసిన వ్యాఖ్యలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. చాలా మంది నన్ను పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. నేను వైఎస్ కుటుంబంతో ఉన్నాను ఉంటానని చెప్పా. చంద్రబాబు నాయుడిపై వేసిన కేసులపై న్యాయ పోరాటం చేస్తా.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా కేసును వెనక్కి తీసుకొను. రేవంత్ కాంగ్రెస్‌లో ఉన్నా.. షర్మిల కాంగ్రెస్‌కు వచ్చినా నా పోరాటం ఆగదు. 


సీఎం అయితే రేవంత్ రెడ్డి ఏమైనా గొప్పా..? తప్పు ఎవ్వరూ చేసినా తప్పే. వైసీపీ ప్రభుత్వం తప్పు చేస్తే వాటిపై కేసులు వేసేందుకు అయినా వెనకాడను. తప్పులు ఎవరు చేశారు అనేది  న్యాయ స్థానాలు తెలుస్తాయి. నాకు జగన్ టికెట్ ఇవ్వలేదని నేను పార్టీని వీడలేదు." అని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. తనకు, చిరంజీవికి, జగన్‌కి మధ్య ఏమి జరిగింది అనేది మా అందరికీ తెలుసని అన్నారు. 


Also Read: Oneplus Nord Ce 3 5G Price: అమెజాన్‌లో సగం ధరకే Oneplus Nord Ce 3 5G మొబైల్‌..అదనంగా రూ.18,900 తగ్గింపు..


Also Read: Devil Movie Review: కళ్యాణ్‌ రామ్ డెవిల్ మూవీ రివ్యూ.. బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేశాడా..?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter