కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ, ఏపీకి దక్కిన కేటాయింపులు ఇవేనా ?
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ, ఏపీకి దక్కిన కేటాయింపులు ఇవేనా ?
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డిఏ సర్కార్ నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పెద్దగా కేటాయింపులేమీ జరగలేదని ఇరు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు పెదవి విరుస్తున్నారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలకు జరిగిన కేటాయింపులను క్లుప్తంగా వెల్లడించారు.
ఏపీలోని సెంట్రల్ వర్సిటీకి రూ.13 కోట్లు, ట్రైబల్ వర్సిటీకి రూ. 8 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే ఏపీలోని ఐఐటీ, ఐఐఎం, నిట్, ఐఐఎస్‌ఈఆర్, ట్రిపుల్ ఐటీలకు మాత్రం ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. అలాగే తెలంగాణలోని హైదరాబాద్ ఐఐటీకి రూ.80 కోట్లు కేటాయించిన కేంద్రం మిగతా ప్రభుత్వ రంగ సంస్థలకు మొండి చెయ్యే చూపిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.