Allu Arjun Met Pawan Kalyan: అల్లు అర్జున్ అరెస్ట్.. ఆ తర్వాత బెయిల్ పై విడుదల కావడం సినీ ఫక్కీలో జరిగింది. జరిగిన ఈ వ్యవహారంతో  టాలీవుడ్ చిత్ర పరిశ్రమతో పాటు మెగా ఫ్యామిలీ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. బెయిల్ ఆలస్యం కావడంతో అల్లు అర్జున్ తన లైఫ్ లో జైలు జీవితం గడపతాడని ఎక్స్ పెక్ట్ చేయలేదు.  జైలు నుంచి విడుదలైన తర్వాత అల్లు అర్జున్ నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లాడు. ఆ తర్వాత పలువరు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ను కలిసి తమ సంఘీభావం ప్రకటించారు. మరోవైపు మరకొంత మంది హీరోలు ఫోన్ ద్వారా బన్ని పరామర్శించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో నిన్న అల్లు అర్జున్ .. మామ గారైన చిరంజీవిని ఆయన ఇంటికి వెళ్లి నేరుగా కలిశారు. అంతేకాదు ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కు చిరంజీవి క్లాస్ పీకినట్టు సమాచారం. మరోవైపు మరో మామగారైన నాగబాబు ను ఆయన ఇంటికి వెళ్లి కలిసారు. ఈ సందర్భంగా నాగబాబు అల్లు అర్జున్ ను ఊరడించినట్టు సమాచారం. మొత్తంగా ముగ్గురు మామల్లో ఇద్దరిని కలిసిన పుష్ప.. తాజాగా తను బాబాయి గా పిలిచే చిన మావయ్య పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు పుష్ప అమరావతికి వెళ్లనున్నారని సమాచారం.


కేవలం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలవనున్నట్టు సమాచారం. అటు ఏపీలో చంద్రబాబు, పవన్ తర్వాత అత్యంత పవర్ఫుల్ అయిన  సినీ నటుడు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను కూడా మర్యాద పూర్వకంగా పుష్ప  కలవనున్నట్టు సమాచారం. ఏది ఏమైనా అరెస్ట్ తర్వాత ఒక్కొక్కరిగా తనకు గాడ్ ఫాదర్ గా భావించే చిరు ను కలిసిన బన్ని.. ఇపుడు వరుసగా చిన మావయ్య పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత చంద్రబాబు, బాలయ్యలను కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.


ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..


ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.