Women Eating Live Creepy Crawlies Video Watch: చాలామంది ఆరోగ్యకరమైన ఆహారాలను తినేందుకు ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. ఇందులో భాగంగానే ఎవరికి ఇష్టమైన ఆహార పద్ధతుల్లో వారు ఆహార పదార్థాలను తింటూ ఉంటారు. కొన్ని దేశాల ప్రజలు పచ్చి ఆకుకూరలను తింటే మరికొన్ని దేశ ప్రజలు మాత్రం కొన్ని జంతువులను కోసి అలాగే పచ్చిగా తింటూ ఉంటారు. వీటినే వారు ఆరోగ్యకరమైన ఆహారాలుగా కూడా భావిస్తారు. అయితే చాలామంది వచ్చి రొయ్యలు, పీతలు, చేపలు, బొద్దింకలు, ఇతర చిన్న చిన్న జీవులను తిని ఉండడం మనం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు వైరల్ అవుతున్న వీడియో వీటికి భిన్నంగా ఉంది. చూస్తే ఇలా కూడా తింటారా? అనే ప్రశ్న మదిలో మిగిలిపోతుంది.. నిజానికి సోషల్ మీడియాలో ఇంతగా వైరల్ కావడానికి వీడియోలో ఏముంది? ఆ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చాలామంది సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటి నుంచి ఏ పనులు చేసిన వాటిని మొబైల్స్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కొన్ని వీడియోస్ షేర్ చేసిన వెంటనే లక్షల మందికి వెళ్లిపోతోంది. అలాగే కొన్ని వీడియోస్ అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటున్నాయి. మరి కొంతమంది అయితే సోషల్ మీడియాలో హైప్ సాధించేందుకే ఇలాంటి వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటున్నారు. అయితే ఇటీవల ఓ యువతి బతికి ఉన్న జెర్రీలను తింటూ వీడియోని పోస్ట్ చేసింది. దీన్ని చూసిన నెటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఏంటి యువతులు ఇలాంటి ఆహారం కూడా తీసుకుంటారా? అని సందేహ పడుతున్నారు.
నిజానికి జర్నీలు ఎంతో విషపూరితమైన వని మనందరికీ తెలిసిందే.. ఇవి పాడు పడ్డ ఇళ్లలో ఎక్కువగా సంచారం చేస్తూ ఉంటాయి. ఈ జెర్రీలు జాతులను విషపూరితమైన విషపూరితమైనవిగా భావిస్తారు. భారతదేశంలో ఉండే కొన్ని జాతులకు సంబంధించిన జర్నీలు ఏమాత్రం విషపూరితమైనవి కావు. ఇవి దాడి చేసినప్పుడు కాస్త మంటగా అనిపించినప్పటికీ.. ఏమాత్రం వీటి నుంచి వచ్చే విషం శరీరానికి ఎలాంటి హాని కలిగించదు. అయితే ఇలాంటి జెర్రీలను ఆ యువతి తినడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజన్స్ తెగ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా వీడియో పై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను @dentist_abtahi అనే ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. ఈ వీడియోలో ఒక జెర్రీ ని తీసి గ్లాస్ లో ఉన్న ఒక ద్రవంలో వేస్తుంది. అప్పుడు ఆ జెర్రీ చనిపోయి క్రిస్పీగా మారుతుంది. ఇలా క్రిస్పీగా మారిన దానిని నేరుగా నోట్లో వేసుకొని నామలేస్తుంది. దీనికి సంబంధించిన సన్నివేశాలు ప్రస్తుతం కొన్ని లక్షల మందికి పైగా వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 5 లక్షల మందికి పైగా ఈ వీడియోకు లైక్ చేసినట్లు సమాచారం. కొంతమంది అయితే ఈ వీడియోకి ఇలా స్పందిస్తున్నారు.. ఆమె ఆ జెర్రీలను పచ్చిగా తినడం లేదు గ్లాసులో ఉండే హాట్ ఆయిల్ లో వేపుకుని తింటుంది.. అని కామెంట్లలో పోస్ట్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.