Allu Arjun: అందుకే ఆ బాబుని కలవలేకున్నా.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్..!

Allu Arjun Sandhya Theater Issue: సంధ్య థియేటర్ సంఘటన.. సినీ ప్రేక్షకులలో అలానే సినీ ఇండస్ట్రీలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిన విషయమే. ఈ విషయంలో కొంతమంది అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తూ ఉండగా.. మరి కొంతమంది మాత్రం అతనకు వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ పెట్టిన ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.     

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Dec 15, 2024, 10:32 PM IST
Allu Arjun: అందుకే ఆ బాబుని కలవలేకున్నా.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్..!

Allu Arjun Viral Tweet: పుష్ప రెండో భాగం.. డిసెంబర్ 4న థియేటర్స్ లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదల తేదీ డిసెంబర్ 5 అయినప్పటికీ.. డిసెంబర్ 4న ఎన్నో థియేటర్స్ లో ప్రీమియర్స్ వేశారు. ఇక ఈ ప్రీమియర్స్ కు ఎంతోమంది జనం పరుగులు తీశారు. ముఖ్యంగా హైదరాబాదులో సంధ్య థియేటర్ కి.. అల్లు అర్జున్, అతని ఫ్యామిలీ రావడంతో.. అక్కడ జరిగిన ప్రీమియర్ షో కి ప్రజలను కంట్రోల్ చేయడం పోలీసుల తరం కూడా కాలేదు. 

ఇక ఈ సంఘటనలోనే.. తొక్కిసలాటకు గురై.. రేవతి అనే మహిళ మృతి చెందగా.. ప్రస్తుతం ఆమె కుమారుడు హాస్పిటల్ లో.. క్రిటికల్ పరిస్థితిలో ఉన్నారు. ఈ కేసులో భాగంగానే.. ఈ మధ్యనే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే కొన్ని గంటల్లోనే ఆయన ఇన్ టర్మ్ బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు. ఈ సంఘటనలో భాగంగా.. కొంతమంది సోషల్ మీడియాలో అల్లు అర్జున్ నిందిస్తున్నారు. అల్లు అర్జున్ అక్కడికి పోవడం వల్లే ఇలా జరిగింది అని.. అంతేకాకుండా బాధితుల కుటుంబానికి అల్లు అర్జున్ కేవలం 25 లక్షల డబ్బు ప్రకటించడం.. అసలు ఏమీ బాగాలేదు అనేది ఎంతోమంది వాదన. 

ఇక ప్రస్తుతం ఆ అబ్బాయి పరిస్థితి విషమంగా ఉంది అని తెలియడంతో.. అల్లు అర్జున్ ఇప్పటికీ కూడా హాస్పిటల్కు పోలేదు అని.. ఆయన ప్రవర్తన మార్చుకోవాలి అంటూ ఎంతోమంది తీవ్రంగా సోషల్ మీడియాలో మంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అసలు ఎందుకు హాస్పిటల్ కి వెళ్ళలేకపోయాడు అనే వివరణ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఇచ్చారు. 

“శ్రీ తేజ పరిస్థితి గురించి నేను చాలా చింతిస్తున్నాను. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న లీగల్ ప్రొసీడింగ్స్ వల్ల.. నన్ను అక్కడికి వెళ్ళద్దు అని వారు అద్వైజ్ చేయడం వల్ల.. నేను వెళ్లి హాస్పిటల్లో శ్రీతేజాన్ని చూడలేకున్నాను. కానీ నా ప్రార్ధనలు..ఎల్లప్పుడూ ఆ అబ్బాయితో ఉంటాయి. అతనికి సంబంధించిన హాస్పిటల్ అవసరాలు, ఫ్యామిలీ అవసరాలు నేను చూసుకుంటాను. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తప్పకుండా వాళ్ళని వెళ్లి నేను కలుస్తాను,” అని తెలియజేశారు. 

Trending News