Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు కుటుంబాల మధ్య చిచ్చు రేపుతున్నాయి. ఇప్పటికే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, మెగా కుటుంబం, నందమూరి కుటుంబాల్లో విబేధాలు రాగా మొన్న ముద్రగడ కుటుంబంలో.. తాజాగా అంబటి రాంబాబు కుటుంబంలో రాజకీయ భేదాభిప్రాయాలు వచ్చాయి. అంబటిపై స్వయంగా అతడి అల్లుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలేని రీతిలో దుర్భాషలాడుతూ ఓ వీడియోను విడుదల చేశారు. పరోక్షంగా తన మామకు ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Revanth AP Tour: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ జోరు.. వైఎస్‌ షర్మిల కోసం రంగంలోకి రేవంత్‌, రాహుల్‌


గౌతమ్ విజ్ఞప్తి
'నమస్తే నా పేరు డాక్టర్‌ గౌతమ్‌. నేను మంత్రి అంబటి రాంబాబు అల్లుడి నేను. అది నా దురదృష్టం. ఎవరూ ఏం చేయలేరు. ఈ వీడియో చేయడం నా బాధ్యత అని భావించి నేను చేస్తున్నా. అంబటి రాంబాబు అంతటి నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు. శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నా జీవితంలో చూడలేదు. పొద్దున్నే రోజు దండం పెట్టుకునేటప్పుడు  ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా జీవితంలో పరిచయం చేయించకు స్వామి అని ఎప్పుడూ కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. ఎందుకు ఇప్పుడు ఇలా చెబుతున్నానంటే ఆయన ఇప్పుడు పోటీ చేసే స్థానం అలాంటిది. ఏ పోస్టుకైతే మంచితనం, మానవతా విలవలు.. కనీసం బాధ్యత ఉండాలో వీటిలో అందరికీ అన్ని ఉండక్కర్లేదు. వీటిలో 0.0 శాతం కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు. ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్నింటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు. ఎలాంటి వాటినంటే ఎవరైతే నిస్సిగ్గుగా.. ఎంత పెద్ద గొంతు వేసుకుని.. ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా దాన్ని నిజం చేయొచ్చు అని విశ్వాసంతో బతుకుతారో సమాజంలో అలాంటి వారికి ఓటు వేస్తున్నట్టు. సమాజంలో ఎంత లేకి పనైనా చేసి చాలా హుందాగా సమాజంలో బతకొచ్చు అని అనుకునేవాళ్లకు ఓటేస్తున్నట్టు. ఏదైనా చేసి సిగ్గులేకుండా సిగ్గులేనితనాన్ని ప్రోత్సహించవచ్చు. ఇలాంటి వారికి ఓటేస్తే ఇదే సమాజం తలరాతగా మారి రేపటి సమాజం కూడా ఇలాగే తయారవుతుంది. ఇది ప్రజలు గమనించి సరైన ఓటుతో సరైన బాధ్యతతో ఓటువేసి సరైన నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ.. నమస్తే' అంటూ తన ప్రసంగం ముగించాడు.

Also Read: Pothina Mahesh: పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ పెళ్లాలు ప్రచారం చేయరా? ఛీ నా బతుకు చెడ


అల్లుడు గౌతమ్‌ చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా సత్తనపల్లి నియోజకవర్గంలో కలకలం రేపాయి. సొంత అల్లుడు అంబటి రాంబాబుపై ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాంబాబుపై అల్లుడు చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా మారాయి. అంబటి రాంబాబు సత్తనపల్లిలో చేసిన అరాచకాలు, అన్యాయాలపై అల్లుడు నిలదీశాడనే చర్చ జరుగుతోంది. అంబటి వ్యక్తిత్వం ఎలాంటిదో ఆయన అల్లుడు చేసిన వ్యాఖ్యలు నిదర్శనంగా ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి.

ప్రతిపక్షాల కుట్ర?
అయితే అల్లుడు అంతటి తీవ్ర వ్యాఖ్యలు చేయడం వెనుక ఏం జరిగి ఉందో అని చర్చలు జరుగుతున్నాయి. అల్లుడు వెనుక ప్రతిపక్షాలు ఉన్నాయని. గెలవలేక అంబటి రాంబాబుపై సొంత కుటుంబసభ్యులతో విష ప్రచారం చేయిస్తున్నాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఎన్నికల్లో యుద్ధం చేసి గెలవాల్సి ఉండగా కుటుంబసభ్యులను రాజకీయాల్లోకి రావడాన్ని అంబటి రాంబాబు వర్గం తప్పుబడుతోంది. చంద్రబాబు కుట్రకు అల్లుడు చిక్కాడని అంబటి వర్గీయులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు తన అల్లుడు చేసిన వ్యాఖ్యలపై అంబటి రాంబాబు స్పందించలేదు. చూడాలి ఆయన ఎలా స్పందిస్తారో?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter