Amit Shah lauds Venkaiah Naidu: ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు సేవలను కొనియాడారు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా. ఎంత ఎదిగినా.. మూలాలను మరిచిపోవద్దనే మాటను గుర్తు చేస్తూ.. ఆయన మాతృ భూమిని ఎన్నడూ మరవలేదని పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర మంత్రి నుంచి ఉప రాష్ట్రపతి వరకు ఎన్నో స్థాయిల్లో ఆయన పని చేశారని చెప్పిన అమిత్​ షా. వాటన్నింటికి వెంకయ్య వన్నె తెచ్చారని (Amit Shah on Vekaiah naidu) పేర్కొన్నారు. వెంకయ్య నాలుగుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారని తెలిపారు.


స్వర్ణ భారతి ట్రస్ట్ వార్షికోత్సవం..


నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జరిగిన స్వర్ణ భారతి ట్రస్ట్ 20వ వార్షికోత్సవంలో (Swarna Bharat Trust 20 years celebrations) ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడుతో కలిసి కేంద్ర హోం శాఖ అమిత్ షా (Amit Shah With Vekaiah naidu) పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన అమిత్​ షా.. వెంకయ్య నాయుడుపై ప్రశంసలు కురిపించారు.


Also read: Special Coins: రూ.75 & 100 కాయిన్లను జారీ చేయనున్న రిజర్వ్ బ్యాంక్


ఆయన క్రమశిక్షణకు మారుపేరని అన్నారు అమిత్​. వెంకయ్య నాయుడు విద్యార్థి స్థాయి నుంచే నాయకుడిగా ఎదిగారన్నారని గుర్తు చేసుకున్నారు. 


ఎమెర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో ఆయన కూడా ముఖ్య పాత్ర పోషించినట్లు చెప్పుకొచ్చారు. ఎన్నో ఉన్నత స్థాయి చర్చల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నట్లు తెలిపారు. ఏ కార్యక్రమం మొదలు పెట్టినా.. రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల గురించే ఎక్కువగా ఆలోచిస్తారని.. రాజకీయంగా ఆయనతో కలిసి పని చేసిన రోజులను గుర్తు చేసుకున్నారు షా.


Also read: Karnataka: యువతి బలవన్మరణం..కాబోయే భర్త వేధింపులే కారణం..!


Also read: Delhi Pollution: ఢిల్లీలో చేయుదాటుతున్న పరిస్థితులు.. లాక్‌డౌన్‌ వైపుగా కేజ్రీవాల్..ఎమర్జెన్సీగా ప్రకటించిన సుప్రీం


ఆర్టికల్ 370 రద్దు బిల్లు ఆమోదంలో వెంకయ్య పాత్ర ఎంతో (article 370 abolition) కీలకమని వివరించారు.


స్వర్ణ భారత్​ ట్రస్టు.. వెంకయ్య నాయుడి గొప్ప ఆలోచన అన్నారు అమిత్ షా. రైతుల కోసం ఎప్పుడూ ఏదో చేయాలని పరితపిస్తుంటారని పేర్కొన్నారు.
వెంకయ్య నాయుడు గురించి ఆయన స్వస్థలంలోనే మాట్లాడాలన్న అభిలాష ఇన్నాళ్లకు నెరవేరిందని అమిత్​ షా తెలిపారు.


Also read: Pradhan Mantri Awaas Yojana: రూ. 700 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసిన ప్రధాని మోదీ


Also read: Curfew in Amaravati: అమరావతిలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. 4 రోజుల పాటు కర్ఫ్యూ.. ఇంటర్నెట్ బంద్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook