Special Coins: రూ.75 & 100 కాయిన్లను జారీ చేయనున్న రిజర్వ్ బ్యాంక్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేక ప్రత్యేక సందర్భాలలో స్మారక నాణేలను విడుదల చేస్తుంది. ఈ నాణేలు సాధారణ చెలామణిలోకి రావు. అవి ఒక జ్ఞాపకంగా మాత్రమే ఉంచబడతాయి. ఇటువంటి నాణేలు మహాపురుషుల జయంతి లేదా ఏదైనా ప్రత్యేక రోజున జారీ చేయబడతాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 14, 2021, 11:44 AM IST
  • RBI ప్రత్యేక సందర్భాలలో స్మారక నాణేలను విడుదల చేస్తుంది
  • రూ.75, రూ.100, రూ.150, రూ.250 వంటి నాణేలు జారీ చేయబడ్డాయి
  • ఇప్పటికీ 50 పైసల నాణెం చెలామణిలో ఉందని RBI తెలిపింది
Special Coins: రూ.75 & 100 కాయిన్లను జారీ చేయనున్న రిజర్వ్ బ్యాంక్

Special Coins: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (The Reserve Bank of India) కొన్ని ప్రత్యేక నాణాలను విడుదల చేయాలని నిర్ణయించింది.. దీనిలో భాగంగా ఈ స్మారక నాణేలను ఒక వ్యక్తి లేదా గౌరవార్థం లేదా జ్ఞాపకార్థం వీటిని జారీ చేయనున్నట్లు తెలిపింది. కానీ ఈ నాణాలు కేవలం జ్ఞాపకార్థం మాత్రమే ఉంచబడతాయి. వేరు వేరు ధరలలో జారీ చేయబడ్డ ఈ నాణేలాలో  రూ.75, రూ.100, రూ.125, రూ.150, రూ.250 నాణేలు కాగా ఇంకా ఇతర ధరల నాణాలను కూడా జారీ చేయబడ్డాయి. 

భారతదేశ మొదటి ప్రధాని (India's first Prime Minister) జవహర్‌లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) గౌరవార్థం 1964లో మొదటి స్మారక నాణేల సిరీస్‌ను విడుదల చేశారు. నాణేల పట్ల ఆసక్తి కలిగి వాటిని పోగు చేసే వారు కూడా వీటిని కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ప్రత్యేక నాణేల ధరల గురించి, వాటిని ఎలా కొనుగోలు చేయాలి మరియు వాటి ధరలు ఎంతో ఇపుడు తెలుసుకుందాం..!!

Also Read: Chandra Grahanam 2021: నవంబర్ 19న కార్తీక పౌర్ణమి.. ఆ రోజే చివరి చంద్ర గ్రహణం.. ఆ రాశిపై ప్రభావం!

ప్రత్యేక సందర్భాలలో విడుదల..

ఈ ప్రత్యేక నాణేలు వెండితో తయారు చేయబడతాయి మరియు వీటిని ప్రత్యేక కార్యక్రమాలలో... ప్రత్యేక సంధర్భాలలో మాత్రమే విడుదల చేయబడతాయి. కొద్ది రోజుల క్రితం, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ISKCON) వ్యవస్థాపకుడు శ్రీ భక్తివేదాంత స్వామి ప్రభుపాద (Bhaktivedanta Swami Prabhupada) 125వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రూ.125 ప్రత్యేక స్మారక నాణెం విడుదల చేశారు. ఇంతకు ముందు కూడా ఇలాంటి నాణేలు జారీ చేయబడ్డాయి.     

వీటిని కొనుగోలు చేయవచ్చు

మీరు ఈ ప్రత్యేక నాణాలను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఆన్‌లైన్‌లో వీటిని కొనుగోలు చేయవచ్చు. ఈ ప్రత్యేక నాణేలను సెక్యూరిటీస్ ప్రింటింగ్ అండ్ కరెన్సీ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (Securities Printing and Currency Manufacturing Corporation of India Limited) అనే వెబ్‌సైట్ ద్వారా ఖరీదు చేయవచ్చు. ఈ వెబ్‌సైట్ లోకి వెళ్లిన తరువాత.. ఈ ప్రత్యేక నాణేలను చూడవచ్చు.. మీరు సాధారణంగా ఎలా అయితే ఆన్‌లైన్ షాపింగ్ చేస్తారో అలాగే వీటిని కూడా కొనవచ్చు. వెండితో చేయబడిన ఈ నాణేలు.. వాటి వాటి ప్రత్యేక లక్షణాల ఆధారంగా ధర కూడా వివిధ రకాలుగా ఉంటుంది. 

Also Read: 10 digit Mobile Number: అవును.. ఫోన్ నంబర్ 10 అంకెలు మాత్రమే ఎందుకు ఉంటుంది..? పదండి తెలుసుకుందాం

50 పైసల నాణెం ఇంకా చెలామణిలో ఉంది

ఈ విషయంపై రిజర్వ్ బ్యాంక్ పూర్తి సమాచారం తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ప్రకారం, ప్రస్తుతం మార్కెట్లో 1 రూపాయి, 2, 5, 10 మరియు 20 రూపాయల నాణేలు చెలామణిలో ఉన్నాయి. అంతేకాకూండా.. ఈ నాణేలు ఎల్లపుడు చెల్లుబాటులో ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ కూడా ధ్రువీకరించింది. ఇప్పటికి 50 పైసల నాణెం చెలామణిలో ఉందని ఆర్‌బిఐ తెలిపింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x