వరల్డ్ కప్ విజేతలను ఇలా ప్రకటిస్తారట... ఐసీసీపై అమితాబ్ సెటైర్
ఐసీసీ నిబంధనలను అనుసరించి ఇంగ్లండ్ ను విశ్వవిజేతగా ప్రకటించడం పై బిగ్ బీ అమితాబ్ స్పందించారు
ప్రపంచకప్ విజేతగా ఇంగ్లాండ్ కు ప్రకటించడంపై క్రీడా రంగ విశ్లేషకులు,వివిధ రంగాల ప్రముఖులతో పాటు అభిమానులు నుంచి తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ అగ్రశ్రేణి నటుడు అమితాబ్ బచ్చన్ దీనిపై తనదైన శైలిలో స్పందించారు.
వరల్డ్ కప్ ఫైనల్లో అత్యధిక బౌండరీల ఆధారంగా ఇంగ్లాండ్ ను విజేతగా ప్రకటించడం పట్ల అమితాబ్ స్పందిస్తూ ఇద్దరు వ్యక్తుల వద్ద చెరో రూ.2000 ఉంటే వాళ్లిద్దరిలో ధనవంతుడు ఎవరు? అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పపుడు ఒకరి వద్ద రూ.2 వేల నోటు ఉండగా..మరొకరి వద్ద నాలుగు రూ.500 నోట్లు ఉన్నాయని..అప్పుడు ఐసీసీ నిబంధనల ప్రకారం చూస్తే ఎక్కువ నోట్లు ఉన్న వ్యక్తే ధనవంతుడు అంటూ సెటైర్ వేశారు.
T 3227 - आपके पास 2000 रूपये, मेरे पास भी 2000 रुपये,
आपके पास 2000 का एक नोट, मेरे पास 500 के 4 ...
कौन ज्यादा अमीर???
ICC - जिसके पास 500 के 4 नोट वो ज्यादा रईस.. #Iccrules😂😂🤣🤣
प्रणाम गुरुदेव
Ef~NS
— Amitabh Bachchan (@SrBachchan) July 15, 2019 >
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్ - న్యూజీలాండ్ పోరు నరాలు తెగే ఉత్కంఠంగా సాగించిన విషయం తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్ టైగా ముగియగా..సూపర్ ఓవర్ విధానం అమలు చేశారు. అది కూడా టైగా ముగియడంతో ఇక ఐసీసీ తన నిబంధన ప్రకారం ఎక్కువ బౌండరీలు బాదిన జట్టును విశ్వవిజేతగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ ఈ మేరక సెటైర్లు సంధించారు.